న్యూఢిల్లీ : సొంత కారు ఉందా? అయితే ఇక ఎల్‌పీజీ సిలిండర్లపై పొందుతున్న సబ్సిడీ విషయాన్ని మర్చిపోవాల్సిందే. దశల వారీగా గ్యాస్‌పై సబ్బిడీ ఎత్తివేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా ఈ నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. నేరుగా నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.6 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను ఏరేసింది.
ఇక రెండో దశలో కారున్న వాళ్లపై సబ్సిడీ ఎత్తివేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రయోగం తొలి దశలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీనికోసం కొన్ని జిల్లాలో ఆర్టీఓ కార్యాలయాల నుంచి కారు యజమానుల సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇది సఫలమైతే, సబ్సిడీలో పెద్ద మొత్తంలో ఆదా పొందవచ్చని ప్రభుత్వం చూస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం చాలామందికి రెండు లేదా మూడు కార్లు ఉన్నప్పటికీ గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారు. అదేవిధంగా వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిందా లేదా చూస్తున్నారు.
ఈ లెక్కల్లో ఎక్కువ మంది ఆదాయాలు పది లక్షలు దాటినట్లయితే వారికి ఒక్కవేటున గ్యాస్ సబ్సిడీని ఎత్తేస్తారు. తమకు అంత ఆదాయం లేదని ఎవరైనా నిరూపించుకుంటే మళ్లీ సబ్సిడీని పునరుద్ధరిస్తారు. దీనికోసం ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎల్‌పీజీ కస్టమర్ల ఆదాయపు సమాచారాన్ని కూడా పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సేకరిస్తోంది. దీనిలో పాన్, రెసిడెంటల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఉండనున్నాయి. అయితే వాహన రిజిస్ట్రేషన్ వివరాలను పొందడం చాలా కష్టమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అడ్రస్‌తో కౌంటర్ చెక్ చేసుకోవాల్సినవసరం ఉందంటున్నారు. గివ్‌ఇట్‌అప్ క్యాంపెయిన్ లాంచింగ్ తర్వాత గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలో ఇప్పటి వరకు 75 లక్షల నకిలీ కనెక్షన్లను గుర్తించామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment