నకిలీ ఖాతాలను అరికట్టడానికి ఫేస్‌బుక్ తన యూజర్ అకౌంట్లకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేస్తుందని వస్తున్న వార్తలపై సోషల్ మీడియా దిగ్గజం స్పందించింది. భారత్‌లో యూజర్ అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయడం లేదని ఫేస్‌బుక్ స్పష్టత ఇచ్చింది. బ్లాగ్ పోస్టు ద్వారా సోషల్ మీడియా దిగ్గజం ఈ క్లారిటీ ఇచ్చింది. తాము ఆధార్ డేటాను సేకరించడం లేదని, ఫేస్‌బుక్‌లోకి సైన్-అప్ అయ్యేటప్పుడు ఆధార్ నెంబర్‌ను యూజర్లు నమోదుచేయాల్సినవసరం లేదని పేర్కొంది.
ఇదేసమయంలో యూజర్లు తమ అకౌంట్లకు ఆధార్ కార్డుపై ఉన్న పేరును వాడితే బాగుంటుందని ఇది సూచించింది. దీంతో తమ ప్లాట్‌ఫామ్‌పై యూజర్లను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు తేలికగా కనుగొనవచ్చన్నారు. ''మేము పరీక్షిస్తున్న వాటిలో ఇది ఆప్షనల్. ఆధార్ కార్డుపై ఉన్న పేరును నమోదుచేయాల్సినవసరం లేదు. ఆధార్‌తో ఎలాంటి ప్రమాణీకరణ లేదు'' అని కంపెనీ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. కానీ తాము టెస్ట్ చేస్తున్న దీంతో పేస్‌బుక్‌లో ఎలా సైన్-అప్ అవ్వాల్లో కొత్త యూజర్లకు అర్థమవుతుందని, కుటుంబసభ్యులు, స్నేహితులు తేలికగా కనెక్ట్ అవ్వచ్చని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment