ఎఫ్‌బీ స్టేటస్‌లు వాటికవే దాగిపోతాయ్ | Facebook testing new 'Hide from your Timeline' feature | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీ స్టేటస్‌లు వాటికవే దాగిపోతాయ్

Published Thu, Jun 9 2016 4:46 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఎఫ్‌బీ స్టేటస్‌లు వాటికవే దాగిపోతాయ్ - Sakshi

ఎఫ్‌బీ స్టేటస్‌లు వాటికవే దాగిపోతాయ్

న్యూయార్క్ : ఫేస్ బుక్ లో ఏదైనా స్టేటస్ ను అప్ డేట్ చేసిన తర్వాత అది కనిపించకుండా (హైడ్ ) చేయడం కొత్త ఫీచరేమీ కాదు. కానీ సోషల్ మీడియా దిగ్గజం కొత్త 'హైడ్ ఫ్రమ్ యువర్ టైమ్ లైన్' అనే ఫీచర్‌ను టెస్ట్ చేసింది. స్టేటస్ ను అప్ డేట్ చేసిన తర్వాత యూజర్లు 'హైడ్ టైమ్ ఫ్రమ్ టైమ్ లైన్' అనే ఆప్షన్ ను నొక్కకుండానే, పోస్టును టైమ్ లైన్ లో నుంచి తొలగించేలా టెస్ట్ చేసింది.  ఫేస్ బుక్ టెస్ట్ చేసిన ఈ కొత్త పోస్టు ద్వారా స్టేటస్ అప్ డేట్ కేవలం న్యూస్ ఫీడ్ కు మాత్రమే కనిపించేలా.. యూజర్ టైమ్ లైన్ లో కనిపించాల్సిన అవసరం లేకుండా చేసింది.

స్టేటస్ అప్ డేట్ ను న్యూస్ ఫీడ్ లో పోస్టు చేసిన తర్వాత ఆ పోస్టు యూజర్ల టైమ్ లైన్ పై చూపించదు. ఈ కొత్త ఆప్షన్ ప్రస్తుతం వెబ్ సైట్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉండదని ఫేస్ బుక్ తెలిపింది. అయితే న్యూస్ పీడ్ నుంచి షేర్ చేసే పోస్టులకు ఈ కొత్త ఫీచర్ పనిచేయదని ఫేస్ బుక్ చెప్పింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement