భారీ ఆర్డర్లతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ క్రాష్!
భారీ ఆర్డర్లతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ క్రాష్!
Published Tue, Jul 22 2014 2:16 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
హైదరాబాద్: వినియోగదారులు నుంచి ఊహించని డిమాండ్ రావడంతో ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్.కామ్ వెబ్ సైట్ క్రాష్ అయింది. గత సంవత్సరం మోటో జీ, మోటో ఈ మొబైల్ ఫోన్ కు ఊహించన డిమాండ్ రావడంతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ కు సాంకేతిక సమస్య తలెత్తింది.
తాజాగా జియోమీ ఎంఐ3 అమ్మకాలను ఎక్స్ క్లూజివ్ గా మధ్యాహ్నం 12 గంటలకు ఆన్ లైన్ లో ప్రారంభించింది. ఈ మొబైల్ ఫోన్ పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడం, ఎక్కువ మంది వినియోగదారులు వెబ్ సైట్ ను సందర్శించడంతో ఫ్లిప్ కార్ట్ కు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కేవలం 10 వేల యూనిట్ల మొబైల్ ఫోన్లకే పరిమితం చేశారు.
ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ క్రాష్ అయిన వెంటనే నిర్వాహకులు యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకుని.. కొద్ది సేపటికే మళ్లీ సేవల్ని పునరుద్దరించారు.
Advertisement
Advertisement