విదేశీ మారక నిల్వలు @36,030 కోట్ల డాలర్లు | Sakshi
Sakshi News home page

విదేశీ మారక నిల్వలు @36,030 కోట్ల డాలర్లు

Published Sat, Jan 7 2017 1:01 AM

విదేశీ మారక నిల్వలు @36,030 కోట్ల డాలర్లు - Sakshi

డిసెంబర్‌ 30తో ముగిసిన వారానికి పెరిగిన నిల్వలు: ఆర్‌బీఐ
ముంబై: విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. గత నెల 30తో ముగిసిన వారానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 62.55 కోట్ల డాలర్లు పెరిగి 36, 029.6 కోట్ల డాలర్లకు పెరిగాయని భారత రిజర్వ్‌  బ్యాంక్‌(ఆర్‌బీఐ) తెలిపింది. ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం..,  అంతకు ముందటి వారంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 93.52 కోట్ల డాలర్లు తగ్గి 35, 967.1 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు జీవిత కాల గరిష్ట స్థాయి, 37,199 కోట్లకు చేరాయి.

డిసెంబర్‌ 30తో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ నిల్వలు 61.24 కోట్ల డాలర్లు పెరిగి 33, 658.2 కోట్ల డాలర్లకు ఎగిశాయి. పుత్తడి నిల్వలు 1,998.2 కోట్ల డాలర్ల వద్ద నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌–ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌) వద్దనున్న స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌(ఎస్‌డీఆర్‌) 49 లక్షల డాలర్లు పెరిగి 143.2 కోట్ల డాలర్లకు చేరాయి. ఈ సంస్థ వద్ద భారత రిజర్వ్‌ స్థితి 82 లక్షల డాలర్లు పెరిగి 229.9 కోట్ల డాలర్లకు పెరిగాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement