దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో బుధవారం పసిడి ఫ్యూచర్ల ధర దిగివచ్చింది. నేటి ఉదయం 10 గంటలకు ఆగస్ట్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.250లు నష్టపోయి రూ.47,317 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో పాటు, భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరలేపినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.541లు లాభపడి రూ.47,026 వద్ద స్థిరపడింది. పసిడి ఇన్వెస్టర్లు భారత్-చైనా సరిహద్దు వివాదాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ట్రేడర్లు రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాల్లో పసిడిలో పెట్టుబడులను రక్షణాత్మక చర్యగా భావిస్తారు.
అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా:
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర స్థిరంగా ట్రేడ్ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 2డాలర్ల స్వల్ప నష్టంతో 1,734.30 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో అమెరికా డాలర్ బలపడటం పసిడి ఫ్యూచర్లపై ట్రేడింగ్‌పై ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు కరోనా వైరస్ రెండోదశ వ్యాధి భయాలు పసిడి ఫ్యూచర్ల పతనాన్ని అడ్డుకుంటున్నాయి. బీజింగ్‌లో వరుసగా 6రోజూ రెండో దశ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో 6రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment