పసిడి... మరికొంత కాలం అనిశ్చితే! | Gracie Gold addresses issues of weight, physical shape in skating | Sakshi
Sakshi News home page

పసిడి... మరికొంత కాలం అనిశ్చితే!

Published Mon, Oct 24 2016 1:25 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

పసిడి... మరికొంత కాలం అనిశ్చితే! - Sakshi

పసిడి... మరికొంత కాలం అనిశ్చితే!

న్యూయార్క్/ముంబై: దీర్ఘకాలంలో సంగతి ఎలా ఉన్నా... వచ్చే రెండు నెలల కాలంలో పసిడి ధర అనిశ్చితిలోనే కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఎన్నికలు, అలాగే ఆ దేశ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణి) పెంపు అంశాలు పసిడి ధరను బేరిష్ ట్రెండ్‌లోనే ఉంచుతాయని అభిప్రాయపడుతున్నారు. స్వల్ప ఒడిదుడుకులతో మరికొంతకాలం పసిడి దిగువ స్థాయిలోనే కొనసాగుతుందని, ఇప్పట్లో ఔన్స్‌కు 1,300 డాలర్లు దాటి బలపడ్డం కష్టమన్న అభిప్రాయం ఉంది.

గడచిన వారంలో పసిడి న్యూయార్క్ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్‌లో స్వల్పంగా 15 డాలర్లు లాభపడి, 1,267 డాలర్లకు ఎగసింది. ఇక ఈ స్వల్ప ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపించింది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్‌లో ధర 99.9 స్వచ్ఛతకు రూ.240 ఎగసి రూ.30,140 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ.29,990 వద్ద ఉంది. వెండి మాత్రం కేజీకి రూ.40 తగ్గి రూ.42,640 వద్ద ముగిసింది.

ఔన్స్ 31.1గ్రాములు.. డాలర్లలో ధర ప్రస్తుతం 1,267 డాలర్లు. డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రస్తుతం దాదాపు 68.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement