న్యూఢిల్లీ: దోమల కారణంగా మలేరియా నుంచి డెంగీ వరకు పలు ప్రమాదకరమైన వ్యాధుల ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో... దోమల కారణంగా వ్యాపించే ఏడు రకాల వ్యాధులకు ఏడాదికి కేవలం రూ.99కే బీమా పాలసీని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ రెమిటెన్స్ కస్టమర్లకే ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. ఈ పాలసీ కింద డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, జపనీస్ ఎన్‌సెఫలైటిస్, కాలా అజార్, లింఫాటిక్ ఫైలేరియాసిస్, జికా వైరస్‌లకు రక్షణ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment