
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా సిటీ, అమేజ్, డబ్ల్యూఆర్–వీ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హోండా సిటీ 20వ వార్షికోత్సవం ఎడిషన్, అమేజ్ ప్రైడ్ ఎడిషన్, డబ్ల్యూఆర్–వీ ఎడ్జ్ ఎడిషన్ అనేవి వీటి పేర్లు. ఇవన్నీ టాప్–ఎండ్ వేరియంట్ల రూపంలో, కొన్ని అదనపు ఫీచర్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి ఎక్స్ షోరూమ్ ధరలివీ...
మోడల్ పెట్రోల్ ధర(రూ.లలో) డీజిల్ ధర
(హోండా సిటీ
20వ వార్షికోత్సవం ఎడిషన్) 13,74,532 13,82,382
హోండా అమేజ్ ప్రైడ్ ఎడిషన్ 6,29,900 7,83,486
డబ్ల్యూఆర్–వీ ఎడ్జ్ 8,01,017 9,04,683