న్యూఢిల్లీ: జీడీపీ వృద్ధి రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 7.7 శాతానికి పెరగడం వెనుక నిర్మాణం, వినియోగానికి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ప్రధానంగా తోడ్పడిందని హెచ్‌ఎస్‌బీసీ ఓ నివేదికలో తెలిపింది. ఈ స్థాయి వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల్లోనే అత్యధికం కావడం గమనార్హం.
తయారీ, సేవల రంగంతోపాటు, సాగు ఉత్పత్తి బలంగా ఉండటంతో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మరోసారి నిలిచింది. అయితే, ఎగుమతులు, ప్రైవేటు వినియోగం నిరాశపరిచినట్టు హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. ఒకవైపు తయారీ, సాగు వృద్ధి పెరగ్గా, మరోవైపు ప్రైవేటు వినియోగం నిరాశపరిచినట్టు పేర్కొంది. అంతర్జాతీయ డిమాండ్ పెరిగినప్పటికీ భారత ఎగుమతుల వృద్ధి మందగించిందని నివేదికలో ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment