
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న వారి వివరాలివ్వాలని ఆర్‌బీఐని కోరింది. సదరు జాబితాను ఐసీఏఐకి చెందిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు పరిశీలించి, అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాల ఉల్లంఘనకు ఏమైనా అవకాశం ఉందా అన్నది తేలుస్తుందని స్పష్టం చేసింది.
మరోవైపు పీఎన్‌బీ, గీతాంజలి జెమ్స్ ఆడిటర్లకు ఐసీఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే, సెబీ, సీబీఐ, ఈడీలు తమ దర్యాప్తు వివరాలను ఐసీఏఐతో పంచుకోవాలని ఆదేశించాలంటూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు లేఖ రాసినట్టు పేర్కొంది.