
నియంత్రణల్లో మార్పులు
ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ సూచన
దావోస్: భారత్‌లో ఆర్థిక సంస్కరణలు తగిన రీతిలోనే అమలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అయితే నియంత్రణ, నియమ నిబంధనల విషయంలో ఇంకా తగిన మార్పులు రావాల్సి ఉంటుందని సూచించారు. కాలం తీరిపోయిన పలు నియమనిబంధనలను మార్చాల్సి ఉంటుందని అన్నారు. నిరుపయోగ నిబంధనలు అధికంగా ఉన్నట్లే... పనికివచ్చే నిబంధనలు సైతం కొద్దిగానే ఉన్నట్లు ఆయన వివరించారు.
ఆయన అభిప్రాయాలు చూస్తే...
నిరుపయోగంగా ఉన్న నిబంధనల మార్పును చేపట్టాలి. ఈ దిశలో క్రమంగా ముందడుగులు పడాలి. ఇది వ్యాపారాల మెరుగుదలకు దోహదపడుతుంది. కొత్త వ్యాపారాలు వస్తున్నాయి. ఉదాహరణకు ఆన్‌లైన్ రుణం. ఇలాంటి వ్యాపారాల అమల్లో ఎదురయ్యే సమస్యలను సరిదిద్దడంపై దృష్టి పెట్టాలి. దిగువస్థాయిలో కొత్త కంపెనీల ప్రారంభానికి బ్యూరోక్రటిక్ నిబంధనల సరళతరం అవసరం. ఆన్‌లైన్ మార్కెట్ మంచి పరిణామం. చైనా గురించి ఆందోళన చెందట్లేదు.