పేటెంటు హక్కుల పరిరక్షణలో అట్టడుగున భారత్
38 దేశాల జాబితాలో 37వ ర్యాంకు
వాషింగ్టన్: అంతర్జాతీయ విధానాలకు భిన్నమైన ప్రమాణాలను పాటిస్తూ పేటెంటు హక్కుల పరిరక్షణలో భారత్ అట్టడుగున ఉంది. 38 దేశాల జాబితాలో ఆఖరు నుంచి రెండో స్థానం దక్కించుకుంది. 37వ స్థానంలో నిల్చింది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎస్‌సీసీ) ఇందుకు సంబంధించి నాలుగో ఐపీ సూచీ వివరాలను విడుదల చేసింది. భారత ఐపీ పరిస్థితులను మెరుగుపరుస్తామంటూ మోదీ సర్కారు చెబుతున్నప్పటికీ.. అవి చేతల్లో ఇంకా కనిపించాల్సి ఉందని యూఎస్‌సీసీ పేర్కొంది. ఐపీ వాతావరణాన్ని మెరుగుపర్చుకోవడానికి ‘అపరిమిత అవకాశాలను’ నివేదికలో పొందుపర్చింది. మూడో వార్షిక సూచీలో 7.23గా ఉన్న భారత్ స్కోరు తాజాగా 7.05కి తగ్గింది. సూచీలో అమెరికా అగ్రస్థానంలోనూ, వెనెజులా ఆఖరు స్థానంలోనూ ఉన్నాయి.