ఫార్మా వృద్ధి 11–13% | Indian pharma industry to grow at 11-13 pc in FY2020 | Sakshi
Sakshi News home page

ఫార్మా వృద్ధి 11–13%

Published Tue, Jul 9 2019 5:33 AM | Last Updated on Tue, Jul 9 2019 8:55 AM

Indian pharma industry to grow at 11-13 pc in FY2020 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 11–13 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఇక్రా వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో ఆర్యోగకర డిమాం డ్‌ ఇందుకు కారణమని వివరించింది. అలాగే యూఎస్‌ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నూతన ఉత్పత్తుల విడుదల, ఇప్పటికే విక్రయిస్తున్న మందుల విషయంలో కంపెనీల వాటా పెరగడం వంటి అంశాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ధరల నియంత్రణ, జనరిక్స్‌ తప్పనిసరి చేయడం, తయారీ కేంద్రాలపై యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీల వంటి రెగ్యులేటరీ పరమైన జోక్యం వృద్ధి ని పరిమితం చేస్తాయని అభిప్రాయపడింది. 21 కంపెనీల ఆధారంగా ఇక్రా ఈ నివేదికను రూపొం దించింది. 2018–19లో భారత ఫార్మా ఇండస్ట్రీ వృద్ధి 12 శాతంగా ఉంది. 2018–19లో డాలరుతో పోలిస్తే రూపాయి 8.4 శాతం పతనం కంపెనీల యూఎస్‌ మార్కెట్‌ వాటా వృద్ధికి తోడ్పడింది.

యూఎస్‌ మార్కెట్లో ఇలా..
ఇక్రా ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ధరల ఒత్తిడి స్థిరంగా ఉండడం, ప్రత్యేక ఉత్పత్తులు, తక్కువ పోటీ ఉన్న ఔషధాల విడుదల, కొనుగోలు చేసిన వ్యాపారాల కన్సాలిడేషన్‌ వంటివి భారతీయ కంపెనీల యూఎస్‌ మార్కెట్‌ వాటా వృద్ధికి దోహదం చేసే అంశాలు. యూఎస్‌లో ఏఎన్‌డీఏ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసిన అరబిందో, డాక్టర్‌ రెడ్డీస్, గ్లెన్‌మార్క్‌ తదితర కంపెనీలు రానున్న రోజుల్లో వృద్ధికి కారణం కానున్నాయి. 2019 జనవరి–మార్చిలో యూరప్, యూఎస్‌ విపణి మద్దతుతో భారత ఫార్మా ఇండస్ట్రీ ఆదాయం వృద్ధి 11.8%గా నమోదైంది. యూఎస్‌ విషయంలో ఇది 21.2 శాతంగా ఉందని ఇక్రా కార్పొరేట్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌరవ్‌ జైన్‌ తెలిపారు. కొన్ని సంస్థల ఆదాయం తగ్గినప్పటికీ యూరప్‌ వృద్ధి 18.8 శాతంగా ఉంది. గత దశాబ్దంతో పోలిస్తే భారత కంపెనీలు ఔషధాల అభివృద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. దీంతో అభివృద్ధి చెందిన మార్కెట్లలో కొత్త అవకాశాలను అందుకునేలా చేస్తోంది.

ప్రత్యేక ఔషధాలపై ఫోకస్‌..
గతంతో పోలిస్తే పలు భారతీయ కంపెనీలు ఆర్‌అండ్‌డీలో పెట్టుబడులను పెంచాయి. 2010–11లో ఆర్‌అండ్‌డీ వ్యయం అమ్మకాల్లో 5.9% ఉంటే, 2016–17 వచ్చేసరికి ఇది 9%కి వచ్చి చేరింది. 2017–18లో 8.8%, గత ఆర్థిక సంవత్సరంలో 7.8%గా ఉన్నట్టు ఇక్రా వివరించింది. నియంత్రిత మార్కెట్లు, ఇంజెక్టేబుల్స్, ఇన్‌హేలర్స్, డెర్మటాలజీ, బయో సిమిలర్లపై కంపెనీల ఫోకస్‌తో ఆర్‌అండ్‌డీ వ్యయాలు 7.5–8% ఉంటాయని అంచనా వేసింది. ఇక ప్రత్యేక ఔషధాలు, మాలిక్యూల్స్, క్లిష్ట చికిత్సలకు అవసరమయ్యే మందుల తయారీపై భారత కంపెనీలు దృష్టిపెట్టాయి. ధరల ఒత్తిడి, ఏఎన్‌డీఏ అనుమతులు వేగంగా రావడంతో నెలకొన్న పోటీ, ఊహించినదాని కంటే తక్కువ ఆదాయ వృద్ధి వంటి యూఎస్‌ మార్కెట్‌లో ఉన్న పరిస్థితులనుబట్టే భారత కంపెనీలు తమ దృక్పథాన్ని మార్చుకున్నాయి. సులువుగా తయారు చేయగలిగే ఉత్పత్తులు, ఎక్కువ కంపెనీలు పోటీ పడుతు న్న సాధారణ జనరిక్స్‌ అభివృధ్ది నుంచి వైదొలగడంతోపాటు క్లిష్ట జనరిక్స్, ప్రత్యేక ప్రొడక్టులపై భారత ఫార్మా సంస్థలు దృష్టిసారిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement