28 బిలియన్ డాలర్లకి ఈ-కామర్స్ పరిశ్రమ!
ముంబై: దేశీ ఈ-కామర్స్ రంగం 2019-20 ఆర్థిక సంవత్సరానికి 28 బిలియన్ డాలర్లకి చేరనుంది. వచ్చే నాలుగేళ్లలో ఈ-కామర్స్ పరిశ్రమలో వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు 45 శాతానికి పైగా నమోదు కావొచ్చని బ్రోకరేజీ సంస్థ కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నివేదికలో పేర్కొంది. కొనుగోలుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటం, అలాగే వారి ఆన్‌లైన్ కొనుగోలు వ్యయాలు స్థిరంగా ఉండటం వంటి అంశాలు ఈ వృద్ధికి కారణాలుగా నిలుస్తాయని సంస్థ తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉన్న కొనుగోలుదారుల విస్తరణ 2020కి 18 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. వీరి సగటు వార్షిక ఆన్‌లైన్ వ్యయాలు 10-15 శాతంమేర పెరగొచ్చని తెలిపింది.