కీలక పరిశ్రమల జోరు.. | key Industry Boom 8.5 percent growth | Sakshi
Sakshi News home page

కీలక పరిశ్రమల జోరు..

Published Wed, Jun 1 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

కీలక పరిశ్రమల జోరు..

కీలక పరిశ్రమల జోరు..

ఏప్రిల్‌లో 8.5 శాతం వృద్ధి రేటు
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తి వృద్ధి రేటు 2015 ఏప్రిల్‌తో పోల్చితే 2016 ఏప్రిల్‌లో 8.5 శాతంగా నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల మంచి పనితీరు దీనికి కారణం. ఇంకా ఈ గ్రూప్‌లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజవాయువు రంగాలు ఉన్నాయి.  2015 ఏప్రిల్‌లో ఈ గ్రూప్ ఉత్పత్తి (2014 ఏప్రిల్‌లో పోల్చితే) అసలు లేకపోగా -0.2 శాతం క్షీణించింది.

గడచిన ఆర్థిక సంవత్సరం మొత్తంగా వృద్ధి రేటు 2.7 శాతంగా ఉంది. రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పాదకత -2.9% క్షీణత నుంచి 17.9 శాతం వృద్ధికి ఎగసింది. ఎరువుల రంగం -0.04 శాతం క్షీణత నుంచి 7.8 శాతానికి ఎగసింది. స్టీల్ ఉత్పత్తి 0.01% వృద్ధి రేటు 6.1 శాతానికి పెరిగింది. సిమెంట్ రంగం -1.4% క్షీణత నుంచి 4.4% వృద్ధికి ఎగసింది. విద్యుత్ ఉత్పాదకత -0.5% క్షీణ రేటు 14.7% వృద్ధి సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement