* 2017 నాటికి అమెరికాను అధిగమిస్తుంది - ఈ-మార్కెటర్
న్యూఢిల్లీ : 2017 నాటికి అధిక మొబైల్ ఫేస్బుక్ ఖాతాదారుల్ని కలిగిన రెండో దేశంగా భారత్ అవతరించనుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లమంది ప్రతినెల ఒక్కసారైనా వారి మొబైల్ ద్వారా ఫేస్బుక్ వినియోగిస్తారని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఈ-మార్కెటర్ తెలిపింది. అలాగే భారత్ ఈ ఏడాది 100 మిలియన్ ఫేస్బుక్ ఖాతాదారుల మార్క్ను చేరుకొని 2017 నాటికి అమెరికాను వెనకు్క నెట్టేస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం అమెరికాలో 123 మిలియన్లు, భారత్లో 101 మిలియన్ల ఫేస్బుక్ ఖాతాదారులు ఉన్నారని అంచనా వేసింది. ఈ సంఖ్య 2017 నాటికి భారత్లో 146 మిలియన్లుగా, అమెరికాలో 138 మిలియన్లుగా ఉంటుందని తెలిసింది. భారత్లో ఇంటర్నెట్ వాడకం పెరగటం, యువత అధికంగా ఉండటం తమ వృద్ధికి సానుకూలాంశాలనీ ఫేస్బుక్ గతంలోనే పేర్కొంది. భారత్లో 99 మిలియన్ల ఖాతాదారులు నెలకు ఒక్కసారైనా, అలాగే ప్రతిరోజూ 45 మిలియన్ల మంది మొబైల్ ఫేస్బుక్ను వినియోగిస్తారు.
అమెరికాను అధిగమించనున్న భారత్!
Published Fri, Jan 23 2015 9:14 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement