‘ఫేస్‌బుక్’ వాడకంలో భారత్ మరో మైలురాయి! | India to clock fastest Facebook user growth globally in 2014 | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌బుక్’ వాడకంలో భారత్ మరో మైలురాయి!

Published Sun, Jun 22 2014 9:46 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

‘ఫేస్‌బుక్’ వాడకంలో భారత్ మరో మైలురాయి! - Sakshi

‘ఫేస్‌బుక్’ వాడకంలో భారత్ మరో మైలురాయి!

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ వాడకంలో ఇప్పటికే అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది మరో మైలురాయిని అధిగమించనుంది. దేశంలో గత ఏడాది 7.78 కోట్లుగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా 40 శాతం పెరుగుదలతో 10.89 కోట్లకు చేరనుందని ఈ-మార్కెటర్ అనే పరిశోధన సంస్థ అంచనా వేసింది. అలాగే 2015 నాటికి ఈ సంఖ్య 13.63 కోట్లకు, 2018 నాటికి 21.12 కోట్లకు పెరగనుందని తెలిపింది.

 

ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఫేస్ బుక్ వాడకం గణనీయంగా పెరగనుందని ఈ -మార్కెట్ పేర్కొంది. ఆ సంస్థ అంచనా ప్రకారం 2018 నాటికి ఆసియా ఫసిఫిక్ దేశాల్లో ప్రతీనెల ఫేస్ బుక్ వాడే వారి సంఖ్య 50 కోట్లు ఉంటుందని తెలిపింది. ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడంలో భారత్ , బ్రెజిల్ దేశాలు లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కాలిఫోర్నియాలో ఉన్న ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement