Asia-Pacific
-
PM Narendra Modi: పెట్టుబడులకు గమ్యస్థానం భారత్
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వరల్డ్’ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహా్వనించారు. నేడు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘18వ ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్–2024’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని సూచించారు. నైపుణ్యం కలిగిన భారతీయ కారి్మకులపై జర్మనీ ఎంతగానో ఆసక్తి చూపుతోందని, వారికి ప్రతిఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఫోకస్ ఆన్ ఇండియా’ హర్షణీయం ‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై భారత్ నేడు సగర్వంగా నిల్చుంది. రహదారులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం. 2047 నాటికి ఇండియాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాం. ఇది చాలా కీలక సమయం. అందుకే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జర్మనీ కేబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నిజంగా హర్షణీయం. జర్మనీ సంస్థలకు ఇండియాలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు భారత్ కంటే మెరుగైన దేశం ఇంకెక్కడైనా ఉందా? లేదని కచి్చతంగా చెప్పగలను. భారతదేశ ప్రగతికి టాలెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి నాలుగు అంశాలు. వీటిని ముందుకు నడిపించడానికి మా వద్ద ‘ఆకాంక్షలతో కూడిన భారత్’ అనే ఇంధనం ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత ప్రజాస్వామీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత అనేవి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. వాటిని విదేశీ వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా జర్మనీ వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి స్థాపనకు సహకరిస్తాం ఉక్రెయిన్, పశి్చమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఏడో ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో భాగంగా మోదీ శుక్రవారం ఢిల్లీలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. భారత్–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కోసం భారత్ కృషి చేయాలని స్కోల్జ్ కోరారు. మోదీ బదులిస్తూ.. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయతి్నంచాలన్నదే భారత్ విధానమని తేలి్చచెప్పారు. -
సస్టెయినబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన సస్టెయినబిలిటీ నిబంధనల అమలులో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ సహా నాలుగు భారత పట్టణాలు స్థానం సంపాదించుకున్నాయి. టాప్ 20 పట్టణాల్లో హైదరాబాద్ 18వ స్థానంలో ఉంటే, బెంగళూరు 14వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ 17, ముంబై 20వ స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు ‘ఏపీఏసీ సస్టెయినబిలిటీ ఇండెక్స్ 2021’ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సస్టెయినబిలిటీ అంటే సులభంగా పర్యావరణానికి, సమాజానికి అనుకూలమైన నిర్మాణాలని అర్థం. సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్బోర్న్ ఇండెక్స్‌లో టాప్–5 పట్టణాలుగా ఉన్నాయి. పట్టణీకరణ ఒత్తిళ్లు, వాతావరణ మార్పుల రిస్క్, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ చర్యలను ఈ ఇండెక్స్ పరిగణనలోకి తీసుకుంది. ‘‘నూతన మార్కెట్ ధోరణలు భారత్‌లో సస్టెయినబిలిటీ అభివృద్ధికి ప్రేరణగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రపంచం కర్బన ఉద్గారాల తటస్థ స్థితి (నెట్ జీరో)కి కట్టుబడి ఉండడం అన్నది పర్యావరణ అనుకూల భవనాలకు డిమాండ్ కల్పిస్తోంది. దీంతో భారత డెవలపర్లు ఈ అవసరాలను చేరుకునే విధంగా తమ ఉత్పత్తులను రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. సస్టెయినబిలిటీ, పర్యావరణ అనుకూల ప్రమాణాలతో కూడిన భవనాలకు డిమాండ్ పెరిగితే ఈ సదుపాయాలు సమీప భవిష్యత్తులోనే అన్ని ప్రాజెక్టులకు సాధారణంగా మారతాయన్నారు. -
సేఫ్‌లో టోక్యో టాప్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని సురక్షితమైన నగరాలు–2019 జాబితాలో ఆసియా–పసిఫిక్ ప్రాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాప్–10లో ఆరు ర్యాంకులను ఈ ప్రాంతంలోని నగరాలే చేజిక్కించుకున్నాయి. జపాన్ రాజధాని టోక్యో తన మొదటి స్థానాన్ని మూడోసారీ పదిలం చేసుకోగా.. సింగపూర్, ఒసాకాలు సైతం తమ పూర్వపు ర్యాంకులను దక్కించుకున్నాయి. అయితే ఈసారి అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ.. తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చింది. 2017లో 23 స్థానంతో సరిపెట్టుకున్న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఈసారి 7వ ర్యాంకును సాధించుకుంది. ముంబై 45వ స్థానంలో.. ఢిల్లీ 52వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితా–2019కి సంబంధించిన నివేదికను ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలకు చెందిన నగరాల్లోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని టాప్–60 సిటీలతో ఈ నివేదికను ప్రచురించింది. దీనిలో భాగంగా ఆయా నగరాల్లోని సైబర్ భద్రత, వైద్య సదుపాయాలు, వ్యక్తిగత భద్రత, మౌలిక వసతులు వంటి అంశాల మేరకు ర్యాంకులను ప్రకటించింది. దీని ప్రకారం.. నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోతున్న హంకాంగ్ 2017లోని తన 9వ ర్యాంకుని కోల్పోయి.. 20వ స్థానానికి పడిపోయింది. ఇక ఆసియా–పసిఫిక్ ప్రాంతం డిజిటల్ సెక్యూరిటీలో చాలా మెరుగవ్వాల్సి ఉందని చెప్పారు. ఆసియా నుంచి ఢాకా(బంగ్లాదేశ్), కరాచీ(పాకిస్తాన్), యంగూన్(మయన్మార్)లు వరుసగా 56, 57, 58 ర్యాంకుల్లో ఉన్నాయి. -
అభివృద్ధి మంత్ర.. ‘3ఆర్’
న్యూఢిల్లీ: ‘3ఆర్’అనే అభివృద్ధి మంత్రాన్ని అందరూ అనుసరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తక్కువ వినియోగం (రెడ్యూస్).. పునర్వినియోగం (రీయూజ్).. శుద్ధి చేసి వినియోగం (రీసైకిల్).. ఈ మూడు ఆర్లు వ్యర్థాల నిర్వహణకు, స్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇండోర్‌లో ప్రారంభం కానున్న ఆసియా, ఫసిపిక్ ఎనిమిదో ప్రాంతీయ 3ఆర్ సదస్సు కోసం ప్రధాని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన 3ఆర్ అనే బంగారు సూత్రం మానవ జాతి స్థిరమైన అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగే ఈ సదస్సు 3ఆర్లు నగరాలకు, దేశాలకు ఎలా ఉపయోగపడతాయో విశ్లే షిస్తుందని పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన నేల, మంచి గాలి అందించాలన్నది ఈ సదస్సు లక్ష్యమని వెల్లడించింది. ఈ నెల 10న ఈ సదస్సును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభిస్తారు. జపాన్ పర్యావరణ శాఖ మంత్రి తదహికో ఇటోతో పాటు పలు దేశాల నుంచి 40 మంది మేయర్లు, భారత్ నుంచి 100 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరవుతారు. వీరంతా సమగ్ర పట్టణాభివృద్ధిపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటారని పేర్కొన్నారు. -
భారత్‌లో సంపన్నుల సంఖ్య 2 లక్షలు...
న్యూఢిల్లీ: అధిక నికర సంపద కలిగిన వ్యక్తుల (హెచ్ఎన్డబ్ల్యూఐలు) సంఖ్యా పరంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ నాలుగో అతిపెద్ద దేశమని క్యాప్‌జెమిని అనే సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. భారత్‌లోని హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల వద్ద 797 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్టు తెలిపింది. 2014లో భారత్‌లో వీరి సంఖ్య 1.8 లక్షలు ఉండగా గతేడాదికి ఈ సంఖ్య 2 లక్షలకు పెరిగిందని... వీరి సంపద సైతం 1.6 శాతం వృద్ధి చెందినట్టు ‘ఆసియా-పసిఫిక్ వెల్త్ రిపోర్ట్ 2016’ పేరుతో విడుదల చేసిన నివేదికలో క్యాప్ జెమినీ సంస్థ పేర్కొంది. 2015లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్యా పరంగా జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ వీరి సంఖ్య 27 లక్షలు. 10 లక్షలకు పైగా హెచ్ఎన్డబ్ల్యూఐలతో చైనా రెండో స్థానంలో ఉండగా, 2.3 లక్షల మందితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తంగా 2015లో ఈ ప్రాంతంలోని హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద 9.9% వృద్ధితో 17.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇదే సమయంలో మిగిలిన ప్రపంచ దేశాల్లో హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద 1.7 శాతమే వృద్ధి చెందినట్టు నివేదిక తెలిపింది. -
సంపన్నుల భారత్
* దేశంలోని ధనికుల సంఖ్య 2.36 లక్షలు * ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నాలుగవ స్థానం * అగ్రస్థానాల్లో జపాన్, చైనా, అస్ట్రేలియా * 2025 నాటికి 4.83 లక్షలకు దేశీ సంపన్నుల సంఖ్య! న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నులు పెరుగుతున్నారు. సంపన్నుల సంఖ్య ప్రామాణికంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్‌లో సంపన్నులు 2.36 లక్షల మంది ఉన్నారు. ఇక 12.60 లక్షల మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (6.54 లక్షల మంది), ఆస్ట్రేలియా (2.90 లక్షల మంది) కొనసాగుతున్నాయి. ‘న్యూ వరల్డ్ వెల్త్’కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్-2016’ వెల్త్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 1 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులను కలిగిన వ్యక్తులను సంపన్నులుగా పరిగణలోకి తీసుకుంటారు. కాగా టాప్ 10లో సింగపూర్ (2.24 లక్షల మంది, ఐదవ స్థానం), హాంకాంగ్ (2.15 లక్షల మంది, ఆరవ స్థానం), దక్షిణ కొరియా (1.25 లక్షల మంది, 7వ స్థానం), తైవాన్ (98,200 మంది, 8వ స్థానం), న్యూజిలాండ్ (89,000 మంది, 9వ స్థానం), ఇండోనేసియా (48,500, 10వ స్థానం) ఉన్నాయి. ఇక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 35 లక్షల మంది సంపన్నులు ఉన్నారు. వీరందరి సంపద విలువ 17.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 15 ఏళ్లలో 115 శాతం వృద్ధి ఆసియా పసిఫిక్ ప్రాంతలో సంపన్నుల సంఖ్య గత 15 ఏళ్లలో 115 శాతం వృద్ధి చెందింది. ఈ వృద్ధి అంతర్జాతీయంగా 82 శాతంగా ఉంది. ఇక వచ్చే పదేళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతపు సంపన్నుల సంఖ్య 50 శాతం వృద్ధితో 52 లక్షలకు చేరుతుందని అంచనా. ఇదే సమయంలో భారత్‌లో సంపన్నుల సంఖ్య 105 శాతం వృద్ధితో 2.36 లక్షల నుంచి 4.83 లక్షలకు చేరుతుందని పేర్కొంది. తలసరి ఆదాయంలో దిగువన తలసరి ఆదాయం ఆధారంగా చూస్తే.. భారత్‌లోని ఒక వ్యక్తి సగటు సంపద 3,500 డాలర్లుగా ఉంది. ఈ సంపద ఆస్ట్రేలియాలో అత్యధికంగా 2,04,000 డాలర్లుగా, పాకిస్తాన్లో అత్యల్పంగా 1,600 డాలర్లుగా ఉంది. భారత్‌లోని వ్యక్తిగత మొత్తం సంపద 4,365 బిలియన్ డాలర్లుగా ఉంటే, చైనాలోని వ్యక్తిగత మొత్తం సంపద అత్యధికంగా 17,254 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలోని అందరి ప్రజల వద్ద ఉన్న సంపదను మొత్తం వ్యక్తుల సంపదగా పరిగణిస్తాం. -
ఫార్చ్యూన్ శక్తివంత మహిళల జాబితాలో చందా కొచర్ టాప్
రెండో స్థానంలో అరుంధతీ భట్టాచార్య ముంబై: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన ‘ఆసియా-పసిఫిక్ ప్రాంత శక్తివంతమైన మహిళల జాబితా’లో భారత బ్యాంకింగ్ రంగానికి చెందిన పలువురు మహిళలు స్థానం పొందారు. ఈ జాబితాలో ప్రైవేట్ రంగ బాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు హెడ్ చందా కొచర్ అగ్రస్థానంలో నిలిచారు. అలాగే ఈమె తర్వాతి స్థానాన్ని (2వ స్థానం) దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య దక్కించుకున్నారు. భారత్‌లో ఐసీఐసీఐ బ్యాంకును విశ్వసనీయమైన, లాభదాయకమైన బ్యాంకుగా తీర్చిదిద్దడంలో చందా కొచర్ ప్రముఖ పాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది. వీరితోపాటు ఈ జాబితాలో హెచ్‌పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ నిషి వాసుదేవా (5వ స్థానం), యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ శిఖా శర్మ (9వ స్థానం) తదితరులు ఉన్నారు. -
మరో 12 నెలలు...పెట్టుబడులకు గడ్డుకాలమే!
న్యూఢిల్లీ: భారత్‌లో కంపెనీల పెట్టుబడి వ్యయాలు జోరందుకోవడానికి(రికవరీ) మరో 12 నెలల వ్యవధి పట్టొచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) అభిప్రాయపడింది. ప్రధానంగా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు వేచిచూసే ధోరణితో ఉండటమే దీనికి కారణమని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ‘రానున్న 2015-16 ఆర్థిక సంవత్సరంలో కూడా పెట్టుబడి వ్యయాల క్షీణత కొనసాగనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అంత్యంత ప్రకాశవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తున్నప్పటికీ ఈ ప్రతికూల ధోరణి కనబడుతోంది. దేశీ కార్పొరేట్లు కొత్త ప్రాజెక్టులకు ముందుకురావడం లేదు. ముందుగా తమ రుణ భారాన్ని తగ్గించుకొని.. లాభాలను పెంచుకోవడంపై అధికంగా దృష్టిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భార త్లో పెట్టుబడుల రికవరీకి ఏడాది కాలం పడుతుం దని భావిస్తున్నాం’ అని ఎస్అండ్పీ వివరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అగ్రగామి 10 కంపెనీల పెట్టుబడి వ్యయాలు రూ.3.7 లక్షల గరిష్టస్థాయిని తాకాయని నివేదిక పేర్కొంది. తర్వాత రెండేళ్లలో ఈ మొత్తం భారీగా తగ్గుముఖం పడుతోందని తెలిపింది. ‘మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశావహంగానే ఉన్నప్పటికీ.. భారతీయ కార్పొరేట్ల పెట్టుబడులు 2015-16లో 10-15 శాతం మేర క్షీణించనున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు ఫలితాల కోసం కార్పొరేట్లు వేచిచూస్తున్నారు. గతేడాది చివరివరకూ కూడా దేశంలో వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా ఆర్థికపరమైన అనిశ్చితి నెలకొంది. ఇవన్నీ కూడా పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయి’ అని ఎస్అండ్పీ అభిప్రాయపడింది. అయితే, విస్తృత స్థాయిలో పెట్టుబడి వ్యయాల రికవరీకి ముందు ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పెట్టుబడులు కొంత చేదోడుగా నిలువనున్నాయని ఎస్అండ్పీ అంచనా వేసింది. -
ఉద్యోగానికి గూగుల్ బెస్ట్!
న్యూఢిల్లీ: పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నిలిచింది. అంతర్జాతీయ ఎంప్లాయర్ బ్రాండింగ్ కంపెనీ యూనివర్సమ్స్ రూపొందించిన ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయ కంపెనీల జాబితాలో గూగుల్ మొదటి స్థానాన్ని సాధించింది. బిజినెస్ విద్యార్ధులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీలు ఒక జాబితాగానూ, ఇంజనీరింగ్, ఐటీ విద్యార్ధులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీలు ఒక జాబితాగానూ ఈ సంస్థ రూపొందించింది. ఈ రెండు జాబితాల్లో గూగుల్ టాప్‌లో నిలిచింది. అయితే ఏ జాబితాలోనూ ఏ ఒక్క భారత కంపెనీకి స్థానం దక్కలేదు. ఈ జాబితాల్లోని కంపెనీలకు భారత్‌లో ఉద్యోగులు భారీగానే ఉన్నారు. బిజినెస్ విద్యార్ధులకు సంబంధించి ఆకర్షణీయ కంపెనీల జాబితాలో గూగుల్ తర్వాతి స్థానాల్లో డెలాయిట్, సిటి, యాపిల్, పీ అండ్ జీ నిలిచాయి. ఇంజినీరింగ్, ఐటీ విద్యార్ధులకు సంబంధించిన జాబితాలో గూగుల్ తర్వాత యాపిల్, మైక్రోసాఫ్ట్, శామ్సంగ్, బీఎండబ్ల్యూలు నిలిచాయి. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ఒక్కో జాబితాలో 50 కంపెనీలున్నాయి. -
‘ఫేస్బుక్’ వాడకంలో భారత్ మరో మైలురాయి!
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్సైట్ ‘ఫేస్బుక్’ వాడకంలో ఇప్పటికే అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది మరో మైలురాయిని అధిగమించనుంది. దేశంలో గత ఏడాది 7.78 కోట్లుగా ఉన్న ఫేస్బుక్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా 40 శాతం పెరుగుదలతో 10.89 కోట్లకు చేరనుందని ఈ-మార్కెటర్ అనే పరిశోధన సంస్థ అంచనా వేసింది. అలాగే 2015 నాటికి ఈ సంఖ్య 13.63 కోట్లకు, 2018 నాటికి 21.12 కోట్లకు పెరగనుందని తెలిపింది. ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఫేస్ బుక్ వాడకం గణనీయంగా పెరగనుందని ఈ -మార్కెట్ పేర్కొంది. ఆ సంస్థ అంచనా ప్రకారం 2018 నాటికి ఆసియా ఫసిఫిక్ దేశాల్లో ప్రతీనెల ఫేస్ బుక్ వాడే వారి సంఖ్య 50 కోట్లు ఉంటుందని తెలిపింది. ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడంలో భారత్ , బ్రెజిల్ దేశాలు లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కాలిఫోర్నియాలో ఉన్న ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం అభిప్రాయపడింది.