కనీస బ్యాలెన్స్ లేదని పెనాల్టీకి ముందే తెలపండి
ముంబై: అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేదన్న విషయాన్ని కస్టమర్లకు పెనాల్టీ విధింపునకు ముందే తెలియజేయాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం సూచిం చింది. ఇందుకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్, లెటర్ వంటి మార్గాలను ఎంచుకోవాలని పేర్కొంది.
కనీస బ్యాలెన్స్ స్థాయికన్నా ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ మొత్తంమీద దామాషా ప్రాతిపదికన పెనాల్టీ చార్జీలు విధించాలి తప్ప, మొత్తం కనీస బ్యాలెన్స్‌పై కూడదని పేర్కొంది. ఆయా అంశాలకు సంబంధించి పెనాల్టీ శాతాలను స్థిరీకరించాలని స్పష్టం చేసింది. సేవింగ్స్ అకౌంట్‌సహా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు 2015 ఏప్రిల్ 1 నుంచీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో బ్యాంకులకు ఆర్‌బీఐ తాజా సూచనలు చేసింది.