Monetary Policy Statement
-
20 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు(4%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి (బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించి 66,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పతనమై 20 వేల స్థాయి దిగువన 19,901 వద్ద నిలిచింది. వెరసి గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 868 పాయింట్లు నష్టపోయి 66,728 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు క్షీణించి 19,879 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,111 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. సెన్సెక్స్ రెండు రోజుల పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.320 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయి (83.32) నుంచి కోలుకుంది. డాలర్ మారకంలో 21 పైసలు బలపడి 83.11 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు చోటు చేసుకున్న అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ నెలకొని ఉంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ... ► ఆర్ ఆర్ కేబుల్ షేరు లిస్టింగ్ పర్లేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.1,035)తో పోలిస్తే 14% ప్రీమియంతో రూ.1,179 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 17% ఎగసి రూ.1,213 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 16% లాభంతో 1,197 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,500 కోట్లుగా నమోదైంది. పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండురోజుల్లోనే ఎక్సే్చంజీల్లో లిస్టయ్యి టీ+2 టైంలైన్ విధానంలో లిస్టయిన తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. ► చివరి రోజు నాటికి యాత్రా ఆన్లైన్ ఐపీఓకు 1.61 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ 3.09 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 4.98 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 2.11 రెట్లు సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనం తర్వాత జూలై ఒకటి నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. అలాగే నోమురా బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘న్యూట్రల్’కి డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో ఈ బ్యాంకు షేరు 4% నష్టపోయి రూ.1564 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ► ఎంఅండ్ఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ఎస్యూవీ విభాగం, ట్రాక్టర్లకు బలమైన ఆర్డర్లు లభించడం ఇందుకు తోడ్పడిందని కంపెనీ తెలిపింది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.1634 వద్ద ముగిసింది. -
పరిమిత శ్రేణిలో.. బలహీనంగా
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలో బలహీనంగా పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడితో పాటు కీలక కార్పొరేట్ క్యూ1 ఫలితాల ప్రకటనల నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల తెరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి కదలికలు, ప్రపంచ మార్కెట్ల పనితీరు, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు. ‘‘ఆర్బీఐ వడ్డీరేట్ల నిర్ణయం ప్రకటన వెలువడనున్న కారణంగా వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలకం కానుంది. కావున సూచీలు పరిమిత శ్రేణిలో ఊగిసలాటకు లోనవుతూ బలహీనంగా కదలాడొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ దిగువున 19,100–19,300 శ్రేణిలో నిరోధాన్ని కలిగి ఉంది. ఎగువు స్థాయిలో 19,650–19,850 పరిధిలో నిరోధం ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. బ్రోకరేజ్ ఏజెన్సీ ఫిచ్ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడం, యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు, చైనా–యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడం తదితర అంశాలతో గత వారం మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. అయితే ఇటీవల సూచీల సు«దీర్ఘర్యాలీ నేపథ్యంలో ఈ పరిణామాలు లాభాల స్వీకరణకు ఊతమిచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 439 పాయింట్ల, నిఫ్టీ 129 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. గురువారం ఆర్బీఐ ద్రవ్య పాలసీ వెల్లడి ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ మంగళవారం(ఆగస్టు 8న) ప్రారంభవుతుంది. చైర్మన్ శక్తికాంత దాస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురువారం(ఆగస్టు 10న) వెల్లడించనున్నారు. వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లను 6.5% వద్దే యథాతథంగా ఉంచొచ్చని ఎక్కువ మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూన్ ద్రవ్యోల్బణం 5% లోపై 4.8 శాతంగా ఉన్నప్పట్టకీ.., అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, రుతు పవనాల అస్థిరతతో పెరుగుతున్న కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ఆర్బీఐ కమిటీ వడ్డీరేట్ల జోలికెక్కపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. తుది దశలో కార్పొరేట్ ఫలితాలు దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్ తుది దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,800కి పైగా కంపెనీలు తమ క్యూ1తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, హిందాల్కో, గ్రాసీం, హీరో మోటో కార్ప్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్, ఎల్ ఐసీ మొదలైనవి జాబితాలో ఉన్నాయి. వీటితో పా టు అంతర్జాతీయ కంపెనీలైన బేయర్, సాఫ్ట్‌బ్యాంక్, ఫాక్స్‌కాన్, సోనీ డిస్నీ, సిమెన్స్ సంస్థలు ఇదే వారంలో త్రైమాసిక ఫలితాలు వెల్లడించను న్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు కీలక దశకు చేరుకున్న తరుణంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్ అధికంగా ఉండొచ్చు. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. స్థూల ఆర్థిక గణంకాల ప్రభావం అమెరికా ఈ వారంలో వాణిజ్య లోటు, ద్ర వ్యోల్బణ, నిరుద్యోగ డేటా, ఇన్వెంటరీ, కన్జూమర్ గణాంకాలు వెల్లడించనున్నాయి. బ్రిటన్ పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ, జీడీపీ డేటాను ప్రకటించనుంది. చైనా ఎఫ్‌డీఐ, ద్రవ్యోల్బణ, ప్రొడ్యూసర్ ప్రైజర్ ఇండెక్స్, వాణిజ్య లోటు డేటా విడుదల కానుంది. ఇదే వారంలోనే భారత్ పారిశ్రామికోత్పత్తి డేటా విడుదల అవుతుంది. ప్రాథమిక మార్కెట్‌పై దృష్టి ఇటీవల ఐపీవోలను పూర్తి చేసుకున్న యధార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ షేర్లు నేడు ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ కానున్నాయి. గత వారంలో ప్రారంభమైన ఎన్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ఇవాళ(ఆగస్టు 7న), కాంకర్డ్ బయోటెక్ ఐపీఓ మంగళవారం (ఆగస్టు 8న) ముగియనున్నాయి. ఈ వారంలో టీవీస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఐపీఓ (ఆగస్టు10 –14 తేదీ) ఉంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరు.., ఐపీఓ స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు. ఆగస్టు తొలివారంలో రూ. 2వేల కోట్లు వెనక్కి... దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టు తొలివారంలో రూ.2,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడంతో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ‘‘భారత మార్కెట్ల వాల్యూయేషన్ ప్రీమియం కావడం, ఇటీవల ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ వంటి అంశాలు కూడా విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణకు కారణం కావచ్చు. అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్ నాలుగు శాతం కంటే ఎక్కువ పెరగడం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులకు ప్రతికూలంగా మారింది’’ అని యస్ సెక్యూరిటీస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నిటాషా శంకర్ తెలిపారు. -
సూచీలకు స్వల్పలాభాలు
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్పలాభాలతో గట్టెక్కాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 58,245 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభంతో 17,177 వద్ద ప్రారంభమయ్యాయి. తొలి దశలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 344 పాయింట్లు ఎగసి 58,418 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు బలపడి 17,207 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 140 పాయింట్ల స్వల్పలాభంతో 58,215 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్ల పెరిగి 17,152 వద్ద నిలిచింది. ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ కమోడిటీ షేర్లు రాణించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.50%, 0.18 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, మీడియా, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. -
మార్కెట్‌కు ఫెడ్ జోష్..!
ముంబై: కీలక వడ్డీరేట్లపై సరళతర ధోరణికే కట్టుబడి ఉన్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు రాణించడం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు వరుసగా ఐదురోజూ లాభాల్లో ముగిశాయి. అలాగే కొత్త రికార్డుల నమోదును కొనసాగించాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు లాభంతో 46,890 వద్ద సిర్థపడింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద నిలిచింది. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు కనిపించడం, పలు దేశాల్లో కోవిడ్–19 వ్యాక్సిన్‌కు అనుమతినివ్వడం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆర్థిక, ప్రైవేట్ రంగ బ్యాంక్, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెనెక్స్ ఇంట్రాడేలో 326 పాయింట్లు లాభపడి 46,992 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 90 పాయింట్లు ర్యాలీ చేసి 13,773 వద్ద నూతన ఆల్‌టైం హైని నమోదు చేసింది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా షేర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సూచీలు కొత్త రికార్డు సృష్టిస్తున్నప్పటికీ.., ఇటీవల మధ్య, చిన్న తరహా షేర్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు తెలిపారు. గురువారం రికార్డు ర్యాలీలో ఈ షేర్ల వాటా అత్యంత స్వల్పంగా ఉంది. ఈ తరుణంలో అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్ అవసరమని వారు సూచించారు. ప్రపంచ ఈక్విటీలకు ఫెడ్ రిజర్వ్ బూస్టింగ్... అమెరికా ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు బుధవారం రాత్రి వెలువడ్డాయి. కరోనాతో పూర్తిగా కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలిచే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేట్లను మార్చలేదు. నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ, ఉద్యోగ కల్పన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు సరళతరమైన విధానాలకే కట్టుబడి ఉంటామని ఫెడ్ తెలిపింది. వ్యవస్థలో ద్రవ్యతను పెంచేందుకు 12 బిలియన్ డాలర్ల విలువైన నెల బాండ్ల కొంటామని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫెడ్ సులభతరమైన ద్రవ్య పరపతి విధాన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు మరింత దూసుకెళ్లాయి. ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇందులో జపాన్‌కు చెందిన నికాయ్ సూచీ 29 ఏళ్ల గరిష్ట స్థాయి చేరువలో ముగిసింది. యూరప్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ ర్యాలీ చేశాయి. అమెరికా సూచీల్లో నాస్డాక్ ఇండెక్స్ బుధవారం సరికొత్త గరిష్టం వద్ద నిలిచింది. ఉద్దీపన ప్యాకేజీ ఆమోదం లభించవచ్చనే ఆశలతో అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ హాంఫట్ 198 రెట్ల బిడ్లు బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ కంపెనీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే 198 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 176.85 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 620.86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 29.28 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు ధర రూ.220గా పలుకుతోంది. ఐపీఓ ద్వారా రూ.540 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. -
కనీస బ్యాలెన్స్ లేదని పెనాల్టీకి ముందే తెలపండి
ముంబై: అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేదన్న విషయాన్ని కస్టమర్లకు పెనాల్టీ విధింపునకు ముందే తెలియజేయాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం సూచిం చింది. ఇందుకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, లెటర్ వంటి మార్గాలను ఎంచుకోవాలని పేర్కొంది. కనీస బ్యాలెన్స్ స్థాయికన్నా ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ మొత్తంమీద దామాషా ప్రాతిపదికన పెనాల్టీ చార్జీలు విధించాలి తప్ప, మొత్తం కనీస బ్యాలెన్స్‌పై కూడదని పేర్కొంది. ఆయా అంశాలకు సంబంధించి పెనాల్టీ శాతాలను స్థిరీకరించాలని స్పష్టం చేసింది. సేవింగ్స్ అకౌంట్‌సహా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు 2015 ఏప్రిల్ 1 నుంచీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో బ్యాంకులకు ఆర్బీఐ తాజా సూచనలు చేసింది.