లోహ షేర్లు విలవిల..! | Iron ore bear predicts prices below $40 by year-end | Sakshi
Sakshi News home page

లోహ షేర్లు విలవిల..!

Published Tue, Nov 24 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

లోహ షేర్లు విలవిల..!

లోహ షేర్లు విలవిల..!

డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు
* 49 పాయింట్ల నష్టంతో 25,819కు సెన్సెక్స్
* 7 పాయింట్ల నష్టంతో 7,849కు నిఫ్టీ
* హిందాల్కో, వేదాంతకు భారీ నష్టాలు...
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో సోమవారం ఆద్యంతం ఊగిసలాటకు గురైన స్టాక్‌మార్కెట్ చివరకు నష్టాల్లో ముగిసింది. దీంతో రెండు ట్రేడింగ్ సెషన్‌ల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం సెలవు కారణంగా ఈ వారంలో  ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కావడంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు.

బీఎస్‌ఈ సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 25,819 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 7,849 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ షేర్లు బాగా నష్టపోయాయి. హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో, లుపిన్ షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి.
 
ఆచి, తూచి: ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగియడం, డాలర్ బలపడుతుండడం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, రూపాయి పతనం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం.. ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపాయి.  
 
సెన్సెక్స్ నుంచి హిందాల్కో, వేదాంత తొలగింపు..: లండన్ మార్కెట్లో రాగి ధరలు ఆరేళ్ల కనిష్టానికి పడిన నేపథ్యంలో లోహ షేర్లు నష్టపోయాయి. వేదాంత, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు 2-4 %మేర పడ్డాయి. సెన్సెక్స్ నుంచి వేదాంత, హిందాల్కో షేర్లను వచ్చే నెల 21 నుంచి తొలగిస్తున్నట్లు బీఎస్‌ఈ ప్రకటన నేపథ్యంలో హిందాల్కో, వేదాంత  షేర్లు బాగా నష్టపోయాయి.  హిందాల్కో 3.8% నష్టపోయి రూ.74 వద్ద, వేదాంత 2.9% నష్టపోయి రూ.90 వద్ద ముగిశాయి.

ఏడాది కాలంలో మార్కెట్ క్యాపిటలైజేషన్  వేదాంత కంపెనీది రూ.42,000 కోట్లు, హిందాల్కోది రూ.16,000 కోట్లు చొప్పున హరించుకుపోయాయి.   హిందాల్కో, వేదాంత షేర్ల నిష్ర్కమణతో సెన్సెక్స్‌లో ఏకైక లోహ షేర్‌గా టాటా స్టీల్ నిలిచింది. ఈ నెల 13న రూ.282గా ఉన్న గెయిల్ ధర పది రోజుల్లో 23%వృద్ధి చెంది  సోమవారం రూ.346 వద్ద ముగిసింది. ఈ కంపెనీకి 49.75 %వాటా ఉన్న మహానగర్ గ్యాస్  సెబీకి ఐపీఓ పత్రాలను సమర్పించిన నేపథ్యంలో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది.
 
హెల్త్‌కేర్ గ్లోబల్  ఐపీఓకు సెబీ అనుమతి
న్యూఢిల్లీ: కేన్సర్ కేర్ నెట్‌వర్క్ సంస్థ హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రెజైస్(హెచ్‌సీజీ) తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించింది, బెంగళూరు కేంద్రంగా పనిచేసే హెచ్‌సీజీ ఈ ఐపీఓ ద్వారా 1.16 కోట్ల తాజా షేర్లతో పాటు ప్రమోటర్ల 1.95 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయిస్తారు. హెచ్‌సీజీ బ్రాండ్ కింద ఈ కంపెనీ 15 సమగ్రమైన క్యాన్సర్ సెంటర్లను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement