ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సీఈవోగా జేమ్స్ మర్డోక్? | Is James Murdoch ready to be Fox CEO | Sakshi
Sakshi News home page

ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సీఈవోగా జేమ్స్ మర్డోక్?

Published Fri, Jun 12 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సీఈవోగా జేమ్స్ మర్డోక్?

ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సీఈవోగా జేమ్స్ మర్డోక్?

న్యూయార్క్: మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తాజాగా ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సంస్థ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని, కుమారుడు జేమ్స్‌కి (42) పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఈ ఏడాది గానీ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ జరగొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ గ్రూప్‌నకు మర్డోక్ (84) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, ఆయన మరో కుమారుడు లష్లాన్ (43) కో-చైర్మన్‌గానూ కొనసాగుతారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఫాక్స్ హాలీవుడ్ స్టూడియోస్, ఇతర టెలివిజన్ విభాగాలు  ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌లో భాగంగా ఉన్నాయి. వివాదంలో చిక్కుకున్న న్యూస్ కార్ప్ మహా సామ్రాజ్యం నుంచి రెండేళ్ల క్రితం ఈ కార్యకలాపాలను విడగొట్టి ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేశారు రూపర్ట్ మర్డోక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement