లాభాల బాటలో మార్కెట్లు | Market extends rally; Sensex zooms over 300 pts, Nifty eyes 7850 | Sakshi
Sakshi News home page

లాభాల బాటలో మార్కెట్లు

Published Mon, May 9 2016 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

Market extends rally; Sensex zooms over 300 pts, Nifty eyes 7850

ముంబై : అంతర్జాతీయ మందగమన భయాలతో గతవారం చివరి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లో, ఈ వారం మొదటి ట్రేడింగ్ లో(సోమవారం) కొనుగోలు ర్యాలీతో పుంజుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 7800 ట్రేడ్ మార్కును దాటి.. 93.60 పాయింట్ల  లాభాల్లో 7827 వద్ద నడుస్తోంది.

సెన్సెక్స్ సైతం 318.38 పాయింట్లు రేజ్ అయి 25536.88గా నమోదవుతోంది. ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఎచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, హిందాల్కో సెన్సెక్స్ లో లాభాలను పండిస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒక్క శాతం నష్టాలను నమోదు చేస్తోంది. థైరోకేర్ టెక్నాలజీ నేటి ట్రేడింగ్ లో దూసుకెళ్తోంది. ఇష్యూ ధర రూ. 446 కంటే 49శాతం ఎక్కువ రేజ్ అయిన థైరోకేర్ ఒక్క షేరు రూ.665గా నమోదవుతోంది.


మరోవైపు పసిడి, వెండి ధరలు దిగివస్తున్నాయి. పసిడి రూ.230 నష్టంతో రూ.30,148గా నమోదవుతుండగా.. వెండి రూ.262 నష్టంతో 41,469 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.41గా ఉంది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement