
సాక్షి, ముంబై: ట్రేడ్ వార్ మరోసారి స్టాక్‌మార్కెట్లలో ప్రకంపనలు రేపింది. దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒక దశలో డై హై నుంచి 500 పాయింట్ల మేర పతనమయ్యాయి. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధభయాలు ముదరవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో మిడ్ సెషన్ తరువాత ఇన్వెస్టర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్323 పాయింట్లు పతనమై 33,047కు చేరగా.. నిఫ్టీ 111పాయింట్లు పడిపోయి 10,133వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కొనసాగుతోందని ఎనలిస్టుల అంచనా.
ఒక్క ఆటో మినహా దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే. మెటల్, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా నష్టపోతున్నాయి. హెక్సావేర్, పీసీ జ్యువెలర్స్, జేపీ, టీవీ18, హెచ్‌సీసీ, వోల్టాస్, సన్ టీవీ, వొకార్డ్, ఒరాకిల్, ఆర్‌కామ్ నష్టపోతుండగా టాటా మోటార్స్,ఐషర్ మోటార్స్, హీరోమోటోతోపాటు బజాజ్ ఫైనాన్స్ లాభపడుతోంది. సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ప్రొడక్టులపై మరోసారి టారిఫ్‌లు ప్రకటించింది. సోయాబీన్స్, ఆటోస్, కెమికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లు తదితర 106 ప్రొడక్టులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.