30 కోట్ల యూనిట్లకు హ్యాండ్‌సెట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్ 30 కోట్ల యూనిట్లకు చేరుతుందని ఫిక్కి-ఈవై సర్వేలో వెల్లడైంది. ఫిక్కి-ఈవై ‘స్పీడింగ్ ఎహెడ్ ఆన్ ద టెలికం, డిజిటల్ ఎకానమి హైవే’ అనే పేరుతో ఓ సర్వేను నిర్వహించింది. సర్వే వివరాలు... ఈ ఏడాది దేశీ తయారీ ఫోన్ల సంఖ్య 4.6 కోట్ల మాత్రమే వుంటుందని అంచనా. 30 కోట్ల యూనిట్ల మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి దేశీయంగా ఫోన్ల తయారీ బాగా పెరగాల్సిన ఆవశ్యకత చాలా ఉంది.
వియత్నాంలాగా ఫోన్ల తయారీకి అంతర్జాతీయ కేంద్రంలా అవతరించాలంటే అన్ని దేశాలు ట్యాబ్లెట్ల, ఫోన్ల తయారీకి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను అందించటంతోపాటు సుస్థిరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. భారత్‌లో మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని నమోదుచేస్తే దానిలో అధిక వాటా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫోన్లకే దక్కుతుంది.
ఎందుకంటే దేశీయంగా ఫోన్ల తయారీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు కాబట్టి. దే శీయంగా ఫోన్ల తయారీ పెరిగితే దిగుమతులు తగ్గి, దాని వల్ల విదేశీ మారక నిల్వలు పెరిగి, చివరకు దాని ప్రభావంతో ఉద్యోగ కల్పన, స్థానిక స్థితిగతుల వృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019 నాటికి 50 కోట్ల ఫోన్ల తయారీని లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం విదితమే.