ఏడాదిలో 55 డాలర్లకు ముడి చమురు
యూబీఎస్ వెల్త్ మేనేజ్‌మెంట్ సీఐవో నివేదిక
దుబాయ్: ముడి చమురు ధరలు రానున్న 12 నెలల కాలంలో మళ్లీ కోలుకుని 50 డాలర్ల పైకి చేరగలవని యూబీఎస్ వెల్త్ మేనేజ్‌మెంట్‌కి చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ (సీఐవో) ఒక నివేదికలో వెల్లడించింది. 11 ఏళ్ల కనిష్టానికి పతనమై ప్రస్తుతం బ్యారెల్‌కి 34 డాలర్లుగా ఉన్న క్రూడాయిల్ ధర ఏడాది కాలంలో 55 డాలర్లకు ఎగయగలదని పేర్కొంది. అయితే, స్వల్పకాలికంగా మాత్రం ముడిచమురు ధర లు బలహీనంగానే కొనసాగే అవకాశం ఉందని వివరించింది. స్వల్ప కాలంలో ధర ఇదే స్థాయిలో ఉన్నా... దీర్ఘకాలికంగా చూస్తే చమురు రంగంలో తగ్గుతున్న పెట్టుబడులతో ఉత్పత్తి తగ్గుదల, డిమాండ్ పెరుగుదల కనిపించగలదని సీఐవో పేర్కొంది.