సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఐటీని కొత్తపుంతలు తొక్కించేందుకు వివిధ శాఖలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి (సీఐఓ)ని నియమంచాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ సూచించారు. సమర్ధ టెక్నాలజీ విధానం కోసం ప్రభుత్వం సీఐఓను నియమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ వ్యూహాల రూపకల్పనతో పాటు వివిధ శాఖలతో సమన్వయం కోసం ఈ ఏర్పాటు ఉండాలని చెప్పారు.
బిగ్ డేటాను సమర్ధంగా నిర్వహించేందుకు భారత్‌కు చీఫ్ డేటా సైంటిస్ట్ అవసరమని అన్నారు. పలు ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌ను అనుసంధానిస్తుండటంతో సీఐఓ పాత్ర అత్యంత కీలకంగా మారుతుందని చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఆధార్ నెంబర్‌తో ఆర్థిక లావాదేవీలను టెక్నాలజీని అనుసంధానించి మిళితం చేయనుంది.
వైట్ హౌస్ సీఐఓ మాదరిగానే సీఐఓ కేంద్ర ప్రభుత్వంతో ఐటీ మౌలిక సదుపాయాలకు సంధానకర్తగా ఉంటారని అధికారులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం వెచ్చించే ఐటీ వ్యయాలకు కూడా వైట్‌హౌస్ సీఐఓ బాధ్యత వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment