
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రతన్
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖలో కేంద్రం కీలక మార్పులు, చేర్పులు చేసింది. ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా రతన్ పి. వాతాల్‌ను (59) సోమవారం నియమించింది. 1978 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి రతన్... ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్. ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్ కార్యదర్శికే ఫైనాన్స్ సెక్రటరీ హోదా దక్కుతుంది. ఆయన నియామకాన్ని ప్రధాని మోదీ ఆమోదించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, శక్తికాంత దాస్‌ను ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగాను, హస్‌ముఖ్ అధియాను రెవె న్యూ కార్యదర్శిగాను కేంద్రం నియమించింది. అధియా, దాస్ బాధ్యతలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌పై సెప్టెంబర్ 4 నుంచి కసరత్తు మొదలవనున్న నేపథ్యంలో తాజా నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శకి ్తకాంత దాస్ 1980 బ్యాచ్ తమిళనాడు క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి.