ఐదు విదేశీ బ్యాంకులపై ఆర్‌బీఐ జరిమానా
ముంబై: విదేశీ మారక నిర్వహణ (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు గాను ఐదు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. డాయిష్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ టోక్యోమిత్సుబిషి, ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఇందులో ఉన్నాయి. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంబంధించి ఆయా బ్యాం కులు ఇచ్చిన వివరణను పరిశీ లించినమీదట డాయిష్ బ్యాంక్‌పై రూ. 20,000,మిగతా బ్యాంకులపై తలో రూ. 10,000 జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.