31 పైసలు బలపడ్డ రూపాయి
Published Wed, Dec 7 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
మూడు వారాల గరిష్ట స్థాయి
ముంబై: ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాలతో డాలర్‌తో రూపాయి మారకం మంగళవారం 31 పైసలు బలపడి 67.90 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. నేటి(బుధవారం) పాలసీలో ఆర్‌బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గిస్తుందనే అంచనాలతో డాలర్ల విక్రయం జోరుగా జరిగిందని నిపుణులు పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉండడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపించిందని వారంటున్నారు. ఫారెక్స్ మార్కెట్లో సోమవారం నాటి ముగింపు(68.21)తో పోల్చితే మంగళవారం రూపాయి మారకం 68.14 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67.86 గరిష్ట స్థాయిని తాకి చివరకు 31 పైసల లాభంతో 67.9 వద్ద ముగిసింది. గత నెల 16 తర్వాత రూపాయి ఈ స్థాయిలో బలపడపడం ఇదే మొదటిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం వచ్చే వారంలో జరగనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డాలర్ స్వల్పంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది.
Advertisement
Advertisement