టైజెన్ ఓఎస్‌తో త్వరలో స్మార్ట్‌ఫోన్లు
న్యూయార్క్: గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకునే దిశగా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ చర్యలు తీసుకుంటోంది. సొంతంగా రూపొందించుకున్న టైజెన్ ఓఎస్‌తో స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘శాంసంగ్ జెడ్’ పేరిట వీటిని జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్లలో 4.8 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్, 2.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 ఎంపీ రియర్ కెమెరా, 2.1 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
అలాగే, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ (64 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్) దీనిలో ప్రత్యేకతలు. శాన్ ఫ్రాన్సిస్కోలో మంగళవారం నుంచి జరిగే టిజెన్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో శాంసంగ్ జెడ్‌ను కంపెనీ ప్రదర్శించనుంది. ప్రస్తుతం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో అత్యధిక భాగం ఆండ్రాయిడ్ ఓఎస్‌వే. గతంలో శాంసంగ్ సొంతంగా ‘బడా’ పేరిట ఓఎస్‌ను రూపొందించుకున్నప్పటికీ.. అంతగా ప్రాచుర్యం పొందలేదు. దీంతో టైజెన్ ప్లాట్‌ఫామ్ రూపకల్పనపై దృష్టి పెట్టింది.
సొంత ఆపరేటింగ్ సిస్టంతో శాంసంగ్ ఫోన్లు
Published Tue, Jun 3 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement