యాప్ కీ కహానీ...
స్క్రిప్‌బాక్స్...
డబ్బే డబ్బును సృష్టిస్తుంది. దీనికి కొంచెం చతురత కావాలి. తెలివిగా ఇన్వెస్ట్‌మెంట్లను చేస్తే అవే మనకు తగిన ప్రతిఫలాన్ని అందిస్తాయి. ఇలా చేయాలంటే వ్యక్తిగత ఆర్థిక వ్యవ హారాలపై పట్టు సాధించాలి. దీనికోసం ముందుగా ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ వంటి తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. ‘స్క్రిప్‌బాక్స్’ యాప్ సాయంతో వీటి గురించి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు...
⇔ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
⇔ పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్ సంబంధిత ఆర్టికల్స్‌ను చదవొచ్చు.
⇔ లెర్న్ సెక్షన్‌లోని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన పలు వ్యాసాలను చదివి మనీ మేనేజ్‌మెంట్‌పై అవగాహన తెచ్చుకోవచ్చు.
⇔ ప్లాన్ అనే ఆప్షన్ ద్వారా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు పొందొచ్చో తెలుసుకోవచ్చు.
⇔ ఇన్వెస్ట్‌మెంట్ కాలిక్యులేటర్ సాయంతో రిటైర్మెంట్‌కు, పిల్లల చదువుకు ఎంత మొత్తం కావాలో అంచనాకు రావొచ్చు.
⇔ యాక్ట్ సెక్షన్‌లో ఆధార్, పాన్ నంబర్లను ఉపయోగించి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, బాండ్స్ వంటి పలు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.