భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 67 పాయింట్లను కోల్పోయి 27,432 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 22 పాయింట్లను నష్టపోయి 8, 260 వద్ద కొనసాగుతోంది.
ప్రధానంగా బ్యాంకింగ్, లోహపు సెక్టార్లలో షేర్లు కిందికి పడిపోవడంతో సెన్సెక్స్ నష్టాలను చవిచూసింది. బుధవారం సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 27,499 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 8,283 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.