ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు నేడు జీఎస్టీ మెరుపులు మెరిపించాయి.
మార్కెట్లో జీఎస్టీ మెరుపులు
Published Mon, Jul 3 2017 4:14 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు నేడు జీఎస్టీ మెరుపులు మెరిపించాయి. త్రిపుల్ సెంచరీని క్రాస్ చేసిన సెన్సెక్స్ చివరికి 300 పాయింట్ల లాభంలో 31,221 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 94.10 పాయింట్ల లాభంలో తన ప్రధాన మార్కు 9,600కి పైన నిలిచింది. జీఎస్టీ బూస్ట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లు దేశీయ సూచీలకు బాగా సహకరించాయి. ఐటీసీ రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. ట్రేడింగ్ ప్రారంభంలో 8 శాతం మేర ఎగిసిన ఐటీసీ, చివరకు 5.92 శాతం లాభంలో క్లోజైంది. నిఫ్టీ ఇండెక్స్‌లో 50 శాతం మేర లాభాలను ఐటీసీనే పండించింది. జీఎస్టీ అమలుతో రిటైల్ ధరలు తగ్గి, విక్రయాలు పెరుగుతాయనే ఆశలతో ఐటీసీ ఈ మెరుపులు మెరిపించింది. 2017 ఏడాదిలోనే రెండో అతిపెద్ద సింగిల్-డే గెయినర్‌గా ఐటీసీ నిలిచింది. ఒక్క ఐటీసీ స్టాక్ మాత్రమే కాక, మెటల్స్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు లాభాల దూకుడును కొనసాగించాయి.
ఐటీసీ, హీరో మోటోకార్పొ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లు నేటి మార్కెట్లు టాప్ గెయినర్లుగా నిలవగా.. ఎన్‌టీపీసీ, కొటక్ మహింద్రా బ్యాంకు, జైపీ ఇన్‌ఫ్రా బాగా నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో టాప్ గెయినర్‌గా అశోక్ లేల్యాండ్ ఉంది. కంపెనీ విక్రయాలు 11 శాతం మేర పెరుగడంతో దీని షేర్లు లాభాల్లో కొనసాగాయి. ఇటు ఎరువులపై కూడా ఆఖరి క్షణంలో పన్ను రేట్లను తగ్గించడంతో ఈ కంపెనీ స్టాక్స్ కూడా పెరిగాయి. జీఎస్టీ అమలుతో దీర్ఘకాలికంగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఎక్కువగా లాభపడతాయని ఓ రీసెర్చ్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ సింగి చెప్పారు. ఇది దీర్ఘకాలికంగా జీడీపీ వృద్ధికి కూడా సహకరించనుందని విశ్లేషకులు చెప్పారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 27పైసలు బలహీనపడి 64.85గా ఉంది. గ్లోబల్‌గా బంగారం ధరలు బలహీనంగా ఉండటంతో పాటు దేశీయంగా జీఎస్టీ అమల్లోకి రావడంతో ఎంసీఎక్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు 96 రూపాయలు నష్టపోయి 28,343 వద్ద నమోదయ్యాయి.
Advertisement
Advertisement