సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు పారిశ్రామికోత్పత్తి దారుణంగా పడిపోవడం, ఆరు నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం షాక్ తగిలింది. దీనికితోడు ప్రపంచ మార్కెట్లు మరోసారి కరోనా వైరస్ ప్రకంపనలకు గురైనాయి. దీంతో ఆరంభం నుంచి నష్టాల్లోనే ఉన్న కీలక సూచీలు మిడ్ సెషన్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్ 106 పాయింట్లు క్షీణించి 41,460 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు నష‍్టంతో 12,175 వద్ద స్థిరపడింది. ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ నష్టపోగా, ఐటీ ఫార్మా స్వల్పంగా లాభపడ్డాయి. యస్ బ్యాంకు, డా.రెడ్డీస్, టైటన్, ఎస్‌బీఐ, జీ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment