షేర్లలోనా లేక ఫండ్స్‌లోనా? | shares or funds! | Sakshi
Sakshi News home page

షేర్లలోనా లేక ఫండ్స్‌లోనా?

Published Mon, Sep 12 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

షేర్లలోనా లేక ఫండ్స్‌లోనా?

షేర్లలోనా లేక ఫండ్స్‌లోనా?

ఫైనాన్షియల్ బేసిక్స్..
పెట్టుబడికి సంబంధించిన ఈ ప్రశ్నకు చాలామంది నిపుణులు చెప్పే సమాధానమేంటంటే... కాస్తంత అనుభవం ఉన్నవారు, మార్కెట్లపై అవగాహన ఉన్నవారు అయితే నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చునని. కాకపోతే తొలిసారి స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న వారు... మార్కెట్లపై, షేర్లపై పెద్దగా అవగాహన లేనివారు మాత్రం మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడమే ఉత్తమమని. అదెలాగో చూద్దాం...
 
ఫండ్స్‌లో డైవర్సిఫికేషన్
ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్లకు ప్రధాన కారణం డైవ ర్సిఫికేషనే. అంటే ఏ ఇన్వెస్టరైనా వారి పెట్టుబడులు రకరకాల సాధనాల్లో ఉండాలనుకుంటాడు. ఒకచోట నష్టాలు వచ్చినా మరోచోట లాభాలొస్తే బయటపడొచ్చు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న డబ్బుతో అన్ని సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కష్టం. ఒకవేళ షేర్లను తీసుకున్నా... తన దగ్గరున్న పెట్టుబడులతో ఏవో కొన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేయగలరు తప్ప... వివిధ రకాల షేర్లలో, వివిధ రంగాల షేర్లలో ఇన్వెస్ట్ చేయటం సాధ్యం కాదు.

అదే ఫండ్స్ అయితే భారీ ఎత్తున నిధులుంటాయి కనక వివిధ రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడి పెట్టడానికి వీలుంటుంది. కొన్ని షేర్లలో నష్టాలొచ్చినా, కొన్ని షేర్లలో లాభాలొస్తే మొత్తమ్మీద ఫండ్స్ లాభాలను అందించగలుగుతాయి. ఈ డైవర్సిఫికేషన్ కోసమే తొలిసారి ఇన్వెస్ట్ చేసేవారు ఫండ్స్‌ను అనుసరిస్తారు. మార్కెట్‌పై అవగాహన తెచ్చుకున్న తర్వాత డెరైక్ట్‌గా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. డెరైక్ట్‌గా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలతోపాటు రిస్క్‌ను కూడా భరించాల్సి ఉంటుంది.
 
ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్
క్రమానుగత పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ అనేది తప్పనిసరి. ఫండ్స్‌లో అయితే ఫండ్ మేనేజర్లు ఈ విషయాలను చూసుకుంటారు. అదే డైరె క్ట్‌గా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే.. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ను మనమే చూసుకోవాలి.
 
వినూత్న పథకాలతో ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ పలు వినూత్నమైన పథకాలను అందిస్తున్నాయి. డైరె క్ట్‌గా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వీటిని మనం పొందలేం. ఆటోమేటిక్ రి-ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్, అసెట్ అలొకేషన్ ప్లాన్, ట్రిగ్గర్స్.. ఇలా ఎన్నో అనువైన స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వీటి వల్ల ఇన్వెస్ట్‌మెంట్లను సులభంగా కొనసాగించవచ్చు.
 
లిక్విడిటీ ఎక్కువ...
స్టాక్ ఇన్వెస్టర్‌కు అప్పుడప్పుడూ లిక్విడిటీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంటే స్టాక్ ధర కొన్న విలువ కన్నా బాగా దిగువకు పడిపోయినప్పుడు ఇన్వెస్టర్ దాన్ని విక్రయించలేడు. అమ్మితే నష్టాలొస్తాయి. అలాగే కొన్ని సమయాల్లో స్టాక్స్ కొనడానికి ఎవరూ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఏమీ చేయలేం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ సమస్య ఉండదు. మన ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లను ఎప్పుడైనా వెనక్కు తీసుకోవచ్చు.
 
ఎవరికి ఏవి బెటరంటే...
* డెరైక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే స్టాక్స్‌ను ఎల్లప్పుడూ మానిటర్ చేస్తూ, వాటిని విశ్లేషించడానికి తగిన సమయం ఉన్నవారు అటువైపు వెళ్లొచ్చు. అయితే ఇక్కడ రిస్క్ అధికంగా ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదు. లాభాలు కూడా అలానే ఉంటాయి. వీరు ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నామంటే సహనం పాటించాలనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
* మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనివారు, ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను సక్రమంగా నిర్వహించుకోవడానికి తగిన సమయం లేనివారు ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం. సిప్ పద్ధతిలో పెట్టుబడులు పెడితే ప్రయోజనం పొందొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement