
బడ్జెట్లో కొన్ని..
⇔ పన్ను వివాదాల్లో చిక్కుకున్న సంస్థలు అసలును కట్టేసి.. వడ్డీ, పెనాల్టీ నుంచి మినహాయింపు పొందవచ్చని, తద్వారా కేసును పరిష్కరించుకోవచ్చని వొడాఫోన్, కెయిర్న్ వంటి సంస్థలకు జైట్లీ పరోక్షంగా సూచించారు.
⇔ దేశీ మైనింగ్ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుత బడ్జెట్‌లో తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్)పై ఉన్న ఎగుమతి సుంకాన్ని తొలగిస్తున ట్లు ప్రకటించారు.
⇔ ద్రవ్య విధాన కమిటీ(మోనేటరీ పాలసీ కమిటీ-ఎంపీసీ) ఏర్పాటు కోసం 1934 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించాలని తన బడ్జెట్లో ప్రతిపాదించారు. బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను, ద్రవ్యోల్బణ లక్ష్యాలను ఈ ఎంపీసీ నిర్ణయిస్తుంది.
⇔ ఎగుమతిదారుల ప్రయోజనం ఉద్దేశించి.. ‘డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్’ను విస్తృతం చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. మరిన్ని ప్రొడక్టులు, దేశాలకు సంబంధించిన దిగుమతులకు ఈ పథకాన్ని విస్తరిస్తారు.
⇔ కమోడిటీ డెరివేటవ్స్ మార్కెట్లో ఆప్షన్ల వంటి మరిన్ని ట్రేడింగ్ సాధనాలను సెబీ అభివృద్ధి చేయనున్నదని జైట్లీ చెప్పారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను మరింత విస్తరించే చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు.
⇔ సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)కు సంబంధించి మరిన్ని బెంచ్‌ల ఏర్పాటు కోసం సెబీ చట్టాన్ని సవరించనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఇచ్చే ఉత్తర్వులను శాట్‌లో సవాల్ చేసే వీలుంది.
⇔ కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ సర్వీసుల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.98,995 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ వేలం సహా డాట్ విధించే పలు రకాల ఫీజులు కూడా ఇందులోకే వస్తాయి.