సాక్షి, ముంబై :దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. ఆరంభంలో 400 పాయింట్లు ఎగిసినా ఆ తరువాత 200 పాయింట్ల లాభాలకు పరిమితమైంది. మిడ్ సెషన్ తరువాతనుంచి మరింత బలహీనపడింది. చివరకు సెన్సెక్స్ 63 పాయింట్ల నష్టంతో 30609 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు బలహీనపడి 9029 వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 31వేల దిగువకు, నిఫ్టీ 9100 దిగువకు చేరింది. సిమెంట్, ఆటో షేర్లు లాభపడగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, షేర్లు నష్టపోయాయి.
మరోవైపు డాలరుమారకంలో రూపాయి 29 పైసలు ఎగిసి 75.66 వద్ద ముగిసింది. శుక్రవారం 75.95 వద్ద ముగిసిన సంగతి తె లిసిందే.
Comments
Please login to add a commentAdd a comment