టాటా మోటార్స్కు జేఎల్ఆర్ దన్ను | Tata Motors Q2 net profit stands at Rs 848 crore | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్కు జేఎల్ఆర్ దన్ను

Published Tue, Nov 15 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

టాటా మోటార్స్కు జేఎల్ఆర్ దన్ను

టాటా మోటార్స్కు జేఎల్ఆర్ దన్ను

రూ. 848 కోట్ల నికర లాభం

 ముంబై: టాటా మోటార్స్ కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.848 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. వివిధ దేశాల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు జోరుగా ఉండడం వల్ల ఈ స్థారుు నికర లాభం సాధించామని కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.1,700 కోట్ల నష్టాలు వచ్చాయని వివరించింది. నికర ఆదాయం రూ.62,647 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.67,000 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇంగ్లండ్, యూరప్, ఉత్తర అమెరికా, చైనా, ఇతర దేశాల్లో జేఎల్‌ఆర్ అమ్మకాలు జోరుగా ఉన్నాయని తెలిపింది.

 స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే నికర నష్టాలు మరింత పెరిగాయని టాటా మోటార్స్ తెలిపింది. గతేడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.289 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు రూ.631 కోట్లకు పెరిగాయి. నికర అమ్మకాలు రూ.11,794 కోట్ల నుంచి 3 శాతం తగ్గి రూ.11,406 కోట్లకు పడిపోయాయని వివరించింది. వాణిజ్య, ప్రయాణికుల వాహనాల అమ్మకాలు (ఎగుమతులతో కలిపి) 6% వృద్ధితో 1,34,397కు పెరిగాయని పేర్కొంది. జేఎల్‌ఆర్ నికర లాభం 9.2 కోట్ల పౌండ్ల నుంచి 24.4 కోట్ల పౌండ్లు(రూ.2,065 కోట్లు)కు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement