హైదరాబాద్‌లో టెలినార్‌ 4జీ | Telenor 4G services in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టెలినార్‌ 4జీ

Jan 19 2017 1:54 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌లో టెలినార్‌ 4జీ - Sakshi

హైదరాబాద్‌లో టెలినార్‌ 4జీ

టెలికం కంపెనీ టెలినార్‌ హైదరాబాద్‌లో 4జీ సేవలను ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో కంపెనీ...

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్‌ హైదరాబాద్‌లో 4జీ సేవలను ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో కంపెనీ ఇప్పటికే 11 పట్టణాల్లో 4జీ సర్వీసులను అందిస్తోంది. రూ.97లకే 1 జీబీ 4జీ డేటాను 28 రోజుల కాల పరిమితితో ఆఫర్‌ చేస్తోంది. టెలినార్‌ కస్టమర్లు 2జీ నుంచి 4జీకి ఉచితంగా అప్‌గ్రేడ్‌ అవొచ్చు. వీరికి 1 జీబీ డేటాను 15 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా ఇస్తారు.

టెలినార్‌ బ్రాండెడ్‌ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్‌ ఔట్‌లెట్లలో సిమ్‌ను మార్చుకోవచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్‌ అందించేందుకు చేపట్టిన టవర్ల ఆధునీకరణ ప్రక్రియ 65 శాతం పూర్తి అయిందని సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ శ్రీనాథ్‌ కొటియన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 6 సర్కిళ్లకుగాను 44 పట్టణాల్లో కంపెనీ 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement