![జీఎంఆర్ ఏవియేషన్: డీజీసీఏ నిషేధంపై హైకోర్టు స్టే...](/styles/webp/s3/article_images/2017/09/2/61398111392_625x300.jpg.webp?itok=mpb88VPi)
జీఎంఆర్ ఏవియేషన్: డీజీసీఏ నిషేధంపై హైకోర్టు స్టే...
న్యూఢిల్లీ: ప్రైవేటు జెట్ సర్వీసు సేవలను అందించే జీఎంఆర్ ఏవియేషన్‌పై డీజీసీఏ విధించిన నిషేధంపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టేను మంజూరు చేసింది. ప్రస్తుత ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేను ఇస్తున్నట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. పౌర విమానయాన నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పదిమంది పెలైట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. పెలైట్లు శ్వాస సంబంధిత పరీక్షలు, ముందస్తు వైద్య పరీక్షలు చేసుకోనందుకు డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.