హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు భాషలోనూ వెబ్‌సైట్ పేర్లు కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. తొలుత దేవనాగరి లిపి అంటే హిందీ, బోడో, డోగ్రి, మరాఠీ, మైథిలి, నేపాలీ, సింధి భాషలను పరిచయం చేస్తారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, ఉర్దూ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ భాషలను తీసుకు రానున్నారు. డాట్ ఇన్ రిజిస్ట్రీగా వ్యవహరిస్తున్న నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా(నిక్సి) ఆగస్టు 27న డాట్ భారత్ ఎక్స్‌టెన్షన్‌ను ఆవిష్కరించనుంది.
తద్వారా భారతీయ భాషల్లో వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తాయని నిక్సి సీఈవో గోవింద్ ఆదివారమిక్కడ జరిగిన వరల్డ్ డొమెయిన్ డే కార్యక్రమంలో చెప్పారు. తెలుగుతోసహా 14 దేశీయ భాషలు ఏడాదిలోగా వినియోగంలోకి వస్తాయన్నారు. డాట్ ఇన్ వెబ్‌సైట్లు 16 లక్షలున్నాయని, 2015 నాటికి 25 లక్షలకు చేర్చాలన్నది నిక్సి లక్ష్యమని చెప్పారు.
రూ.1,500 కోట్ల వ్యాపారం..
అంతర్జాతీయంగా డొమెయిన్ల(వెబ్ అడ్రస్) వ్యాపార పరిమాణం 15% వృద్ధి రేటుతో రూ.1,500 కోట్లుంది. 76 కోట్ల వెబ్‌సైట్లలో భారత్‌కు చెందినవి కేవలం 20 లక్షలేనని వరల్డ్ డొమెయిన్ డే ఫౌండర్, యాక్సియామ్ సీఈవో ప్రఖార్ బిందల్ చెప్పారు. తిరుపతి బాలాజీ.కామ్ వెబ్‌సైట్ విక్రయం ద్వారా రూ.30 లక్షల ఆదాయాన్ని యాక్సియామ్ ఆశిస్తోంది. ప్రైవేటు ఈక్విటీ ద్వారా రూ.60 కోట్లు సమీకరించనున్నట్లు మెడికల్ బజార్.కామ్ ఎండీ కృష్ణ దేరెడ్డి తెలిపారు.
తెలుగులోనూ వెబ్‌సైట్ పేర్లు
Published Mon, Aug 25 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement
Advertisement