సాక్షి,న్యూఢిల్లీ: ఐటీ కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను అత్యధికంగా విద్యా రంగంపై వెచ్చిస్తున్నాయి. నాస్కామ్ ఫౌండేషన్ నిర్వహించిన అథ్యయనంలో ఐటీ కంపెనీలు విద్యపైనే తమ సీఎస్‌ఆర్ నిధులను భారీగా ఖర్చు చేస్తున్నారని తేలింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బహుళజాతి సంస్థల్లో 76 శాతం కంపెనీలు మానవ వనరులను అందించే విద్యపై ఖర్చు చేసినట్టు వెల్లడైంది. ఇక లింగ సమానత్వంపై 18 శాతం సంస్థలు, ఆకలి, పేదరిక నియంత్రణపై 12 శాతం సంస్థలు అధికంగా నిధులు వెచ్చించినట్టు తేలింది.
సామాజిక అభివృద్ధిపై ఐటీ, బీపీఎం సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయని, వినూత్న పోకడలత ఐటీ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నాయని నాస్కామ్ ఫౌండేషన్ చీఫ్ శ్రీకాంత్ సిన్హా చెప్పారు.ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా సీఎస్‌ఆర్ కార్యక్రమాలను అత్యున్నత సాంకేతిక సాయంతో ఆయా నిధులను బాధ్యతాయుతంగా కంపెనీలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత, బహుళజాతి కంపెనీల్లో 62 శాతం సంస్థలు తమ సీఎస్‌ఆర్ నిధుల్లో నూటికి నూరు శాతం విద్యపైనే వెచ్చించాయని ఈ సర్వేలో వెల్లడైంది.
విద్యపై సీఎస్‌ఆర్ నిధుల్లో 50 శాతం కంటే తక్కువగా వెచ్చించినట్టు కేవలం 5 శాతం ఐటీ కంపెనీలే పేర్కొన్నాయని తెలిపింది.రూ 100 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన చిన్న సంస్థలు సైతం సీఎస్‌ఆర్ నిధులను సమర్థవంతంగా ఖర్చు చేశాయని అథ్యయనం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment