విండోస్ ఫోన్ వాట్సాప్ (ఫైల్ ఫోటో)
విండోస్ ఫోన్ వాడుతున్న వారు ప్రస్తుతం చాలా కొద్ది మంది మాత్రమే. వారిని కూడా ఎక్కడా నిరాశ పరచకూడదని నిర్ణయించింది వాట్సాప్. ఈ కొద్ది మంది విండోస్ ఫోన్ యూజర్లకు కూడా వాట్సాప్ బీటాను అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేషన్‌లో స్టికర్స్ ఫీచర్‌ను కొత్తగా తీసుకురావడం, స్టికర్స్ నోటిఫికేషన్ ఐకాన్ రీడిజైన్ చేయడంతో పాటు లైవ్ లొకేషన్ షేరింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్లన్నీ ప్రస్తుతం విండో ఫోన్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.18.24లో అందుబాటులో ఉన్నాయి. స్టికర్స్ ఫీచర్, స్టికర్స్ నోటిఫికేషన్ ఐకాన్ రీడిజైన్ వంటి ఫీచర్లు ఇప్పటివరకు వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ ప్లాట్‌ఫామ్‌లపై అందించడం లేదు.
తాజాగా చేసిన విండోస్ ఫోన్ బీటా అప్‌డేట్, డబ్ల్యూఏబీటాఇన్ఫోలో తొలుత స్పాట్ అయింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్స్‌లో ఈ స్టికర్స్‌ను విండోస్‌ఫోన్ యూజర్లు పంపించుకోవచ్చు. ప్లాట్‌ఫామ్‌లన్నింటిపై కూడా స్టికర్స్ ఫీచర్ కొత్తదని, స్టికర్స్ ఫీచర్‌ను తొలుత 2.18.24 బీటాకే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. అయితే వాట్సాన్ బీటా వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ ప్లాట్‌ఫామ్‌లపైకి కూడా ఈ కొత్త స్టికర్స్ ఫీచర్స్ రాక కోసం యూజర్లు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో యూపీఐ ఆధారిత పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడానికి వాట్సాప్ పరీక్షిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రారంభించబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment