
రాంచీ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 11 మంది మృతి చెందగా 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ప్రయాణీకులతో రాంచీ నుంచి గాయాకు బయల్దేరిన బస్సు రెండో నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. బస్సు హజీరాబాగ్ జిల్లాలోని దనువాఘటికి చేరుకోగానే బ్రేక్స్ ఫేయిలై స్టీల్‌రాడ్స్ లోడ్‌తో ముందు వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది. దీంతో ఆ రాడ్లు ప్రయాణీకులకు గుచ్చుకోవడం ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment