
ప్రమాదం నాటి దృశ్యాలు(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : వనస్తలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో నగర్‌లో ఉన్న క్రిస్టల్ క్రాప్ ఫెస్టిసైడ్ గోదాంలో గత నెల23న అనుమానాస్పదంగా జరిగిన అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. క్రిస్టల్ క్రాప్ కంపెనీతో సంబంధం ఉన్న సీగే ఎల్లారెడ్డి అనే వ్యక్తి ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఎల్లారెడ్డి గోదాంలో ఉన్న 3.5కోట్ల రూపాయల విలువ చేసే ఫెస్టిసైడ్‌ను అక్రమంగా తరలించి మిగిలిన మెటీరియల్‌ను పెట్రల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో 15మందిపై కేసు నమోదుచేసిన పోలీసులు 8మందిని అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న మరో 7మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి నుంచి 3.31కోట్ల విలువైన ఫెస్టిసైడ్‌తో పాటు 5డీసీఎమ్‌లు, ఒక స్విప్ట్ డిజైర్, 2సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఏ5గా భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా సందీప్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment