సాక్షి, హైదరాబాద్: తనను మోసం చేసేందుకు తోట బాలాజీనాయుడు అనే వ్యక్తి ప్రయత్నించిన మాట వాస్తమేనని తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలిత తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... అతడిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 2 కోట్ల నిధులు వస్తాయని తనను నమ్మించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. బాలాజీ వ్యవహారంపై అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్ట్ చేశారని తెలిపారు.
కాగా, ఇప్పటివరకు 19 సార్లు జైలుకు వెళ్లొచ్చిన బాలాజీనాయుడు ప్రముఖులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రభుత్వ పథకాలు పేరు చెప్పి ఇప్పటి వరకు 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోపీ పెట్టాడు. ఏపీ, తెలంగాణల్లోని 29 పోలీస్‌స్టేషన్లలో ఇతడిపై కేసులున్నాయి. ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలైన అతడు తాజాగా పోలీసులకు చిక్కాడు.
‘మోసం చేయాలని చూశాడు’
Published Thu, Nov 9 2017 2:22 PM | Last Updated on Thu, Nov 9 2017 2:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment