
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో బాలికపై బాలుడు అత్యాచారం చేశాడు. బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలలపై నేరాల నిరోధానికి ఉద్దేశించిన పోక్సో చట్టం కింద బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ స్నేహిత, సీఐ నాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment