
సాక్షి, ముంబై : పశ్చిమ మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు నదిలో పడి 13 మంది దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి కొల్హాపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
గణపతిపూలే నుంచి పుణే వెళ్తున్న మినీ బస్సు రాత్రి 11గం.45ని. కొల్హాపూర్.. శివాజీ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవటంతో బస్సు అదుపు తప్పి బస్సు పంచగంగ నదిలోకి దూసుకుపోయింది. అటుగా వెళ్తున్న వాహనాదారులు అది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోగా.. తీవ్ర గాయాలతో ఇద్దరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్రలోని జారుకోవటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment